..................
ఎన్టీఆర్ - సావిత్రి నటించిన ‘రక్త సంబంధం’ విడుదలై ఈ నవంబరు 1కి ఏభై ఏళ్ళు
అయిన సందర్భం. ఈ సందర్భంగా మహా న్యూస్ చానల్ రాత్రి 10.30కి (నవంబర్ 1)
‘రక్తసంబంధం-50’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అలాగే ఈటివి-2
అంతకుముందురోజు రాత్రే (అక్టోబర్ 31 రాత్రి 10.30కి) ‘ఈటీవీ టాకీస్’ శీర్షికలో కొంత సమయాన్ని ఈ అంశానికి కేటాయించింది. అవడానికి రక్తసంబంధం చిత్రం శివాజీ గణేషన్
నటించిన ‘పాశమలైర్’ తమిళ చిత్రానికి తెలుగు సేతే అయినా తెలుగులో నటించిన
నటీనటుల (ముఖ్యంగా ఎన్టీఆర్ -సావిత్రి) కున్న ఇమేజ్ దృష్ట్యా చాలా వెనుకా ముందూ
ఆలోచించి నిర్మించిన చిత్రం. ప్రత్యేకించి వారిద్దరి పాత్రలకున్న బంధుత్వం (అన్నా -చెల్లెలు) దృష్ట్యా ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో అన్నదానిపై తెగ తర్జన భర్జనలు చేసి తెరకెక్కించిన తతంగం. అలాగే మాటలు రచయితగా ముళ్లపూడి వెంకట రమణను
ఎంపిక చేయడమూ సాహసమే.
....................................
‘‘తొందరగా పనులు పూర్తిచేసేయ్, కరెంట్ పోతే ఇంకే పనులూ కావు...’’- ఈ డైలాగు సాధారణంగా ఇప్పుడు ప్రతి గృహంలోనూ విన్పడుతున్నమాట. ఎందుకంటే ఈ ఊరూ, ఆ ఊరూ అని లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లోనూ ఈ ‘కరెంట్ కష్టాలు’ ఉన్నాయి. అలా ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏ పనీ చెయ్యలేం అన్నమాటే కరెంటుతో ‘కరెంట్’ (ప్రస్తుత) ప్రజావళి ఎంతగా మమేకమైపోయారో తెలుపుతోంది. ఇలాంటి అనుక్షణ ఆందోళనాంశాన్ని శీర్షికగా తీసుకుని ‘విద్యుత్- వెతలు’ పేరిట ఈటివి-2 ప్రతీరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ‘ప్రతిధ్వని’లో చర్చా కార్యక్రమాన్ని అక్టోబర్ 31న ప్రసారం చేసింది. ఇందులో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారితో పాటు సంబంధిత రంగ నిపుణులు చాలా ఆసక్తికర చర్చ జరిపారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ తీవ్ర సంక్షోభం ముందస్తు ప్రణాళిక ఉండవలసిన వారికి ఉండకపోవడంతో ఉద్భవించినదే అని చాలామటుకు అంగీకరించారు. విద్యుత్ కొరత ఎంతగా ఉందంటే గ్రామీణ ప్రదేశాల్లో ఎలక్ట్రిసిటీ ఉన్న సమయం కంటే లేని గంటలే ఎక్కువ. దీనికి కారణం ప్రధానంగా అందరూ చెప్పే ‘డిమాండ్- సప్లై’ (జనాభా- అవసరాలు పెరుగుతున్నాయే గానీ దానికి తగ్గట్లు విద్యుత్ ఉత్పాదన, సమీకరణ జరగకపోవడం) అంతరాలే. అయితే కొన్ని సందర్భాలలో అన్ని పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుని రూపొందించిన అంచనాలకే అందని రీతిలో డిమాండ్ పెరిగిపోవడమే ఈ కలవరపరిచే సంక్షోభానికి ముఖ్య కారణం అనీ నిపుణులు ఇందులో చెప్పారు. ఉదాహరణకు నవంబరు మొదటి వారం వస్తున్నా, ఏ మాత్రం కరెంటు వినియోగం శాతం తగ్గకపోగా ఇంకా పెరిగిపోవడం అని నిష్ణాతులు ఇందులో చెప్పారు. ఇంకో ఆశ్చర్యకరమైన అంశం- మనకన్నా విస్తీర్ణతలో, జనాభాలో తక్కువగా ఉన్న రాష్ట్రాలు సైతం విద్యుత్ సామర్థ్యపు శక్తిని దూరదృష్టితో ఎక్కువగా కలిగి వుండడం. అలా ఎక్కువగా విద్యుత్ నిల్వలు కలిగివున్న రాష్ట్రాల నుంచి కొనుగోలు చేద్దామంటే ‘గ్రిడ్’ సమస్యలని పాలక ముఖ్యులు చెప్తూన్నారు. కానీ అవన్నీ సాంకేతిక సమస్యలు కనుక వాటిని అధిగమించి జనావళికి ‘పవర్’ (విద్యుత్) ప్రాప్తాన్ని చేర్చవచ్చు. ఇది అందరూ ప్రత్యేకించి ‘పవర్’ (పదవి)లో ఉన్నవారు దృష్టి పెట్టాల్సిన అంశం. ఉన్న అరగంటలో ఎక్కువగా సమస్యను చెప్పుకొచ్చారు కానీ, నివారణ చర్యలను తెలియచేయడానికి సరైన సమయం ఇవ్వలేదనిపించింది. సమస్య, ఎందుకొచ్చిందో అన్నది ప్రస్తుత పరిస్థితిని చూసిన వారికందరికీ తెలుసు. విపత్తుని విజయవంతంగా ఎదుర్కోడానికి ఏం చేయాలో అన్నదానిపై దృష్టి ఎక్కువగా సారిస్తే బావుండేది. కానీ విద్యుత్ నెంతగా కొనుగోలు చేసి అందించినా దాన్ని సరైన రీతిలో అవసరమైనంతవరకూ వినియోగపరచుకుంటేనే భావితరాలకు విద్యుత్ పరంగా భవిష్యత్తు ఉంటుంది. మనలో చాలామంది గదిలోకి వెళ్లిన వెంటనే లైట్ స్విచ్ వేస్తాం. కానీ అదే వేగంతో గదినుంచి బయటకు వెళ్ళేటప్పుడు వేసిన స్విచ్‌ను ఆఫ్ చేయం. అది మళ్లీ మరొక మంచి మనిషి ఆపేవరకూ ఆ బల్బు, వెలుగుతూనే వుంటుంది. ఇది చిన్నవిషయమే అయినా అదే ఇంతింతై రీతిలో... ఒకనాటికి విషాద రూపానికి తీసుకువచ్చేస్తుంది... ఇది అందరూ గమనించాలి. ఎందుకంటే, ‘విద్యుత్ పొదుపు చేయడమంటే, ఉత్పత్తి చేసినదానికన్నా ఎక్కువ’. ఇదే రోజు సాక్షి చానల్‌లో రాత్రి 9 గంటలకు వచ్చిన ‘ప్రైమ్ టైమ్ షో’లో ఇదే విద్యుత్ అంశం గూర్చి, వివరణాత్మక చర్చ వచ్చింది. అదే రోజు ముఖ్యమంత్రి మెదక్ జిల్లా పర్యటనలో ఇదే అంశాన్ని ప్రముఖంగా స్పృశించారు. ఇలా ఆనాటి విషయాలు ఆధారం చేసుకుని ఆనాడు వార్తా చానల్స్ పతాక శీర్షికలుగా చర్చలు ప్రసారం చేయడం ధర్మం, సహజం కూడా. కానీ ‘సాక్షి’, ఈటివి-2 చానల్స్‌లో పాల్గొన్న సంబంధిత రంగ నిపుణులుకూడా ఒకరే కావడం గమనార్హం. ఈ కార్యక్రమాల్లో సాక్షి టివి ప్రత్యక్ష ప్రసారం, ఈటివి-2 ముందుగా రికార్డు చేసిన కార్యక్రమం కనుక అది సాధ్యపడినా, వ్యక్తులు వేరుగా వుండేటట్లు నిర్వాహకులు చూసుకుంటే బావుంటుంది. దానివల్ల అభిప్రాయ వైవిధ్యత, అమలుపరచడానికి ఎంపికకు అవకాశాలుంటాయి.
అపురూప చిత్రం
ఇలా ఒకే అంశం గురించి దాదాపు అన్ని చానల్సూ తమ ప్రసార సమయాల్లో చోటిచ్చిన సంగతి గతవారం మరొకటి జరిగింది. అది ఎన్టీఆర్ - సావిత్రి నటించిన ‘రక్త సంబంధం’ విడుదలై ఈ నవంబరు 1కి ఏభై ఏళ్ళు అయిన సందర్భం. ఈ సందర్భంగా మహా న్యూస్ చానల్ రాత్రి 10.30కి (నవంబర్ 1) ‘రక్తసంబంధం-50’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. అలాగే ఈటివి-2 అంతకుముందురోజు రాత్రే (అక్టోబర్ 31 రాత్రి 10.30కి) ‘ఈటీవీ టాకీస్’ శీర్షికలో కొంత సమయాన్ని ఈ అంశానికి కేటాయించింది. అవడానికి రక్తసంబంధం చిత్రం శివాజీ గణేషన్ నటించిన ‘పాశమలైర్’ తమిళ చిత్రానికి తెలుగు సేతే అయినా తెలుగులో నటించిన నటీనటులు (ముఖ్యంగా ఎన్టీఆర్ -సావిత్రి) కున్న ఇమేజ్ దృష్ట్యా చాలా వెనుకా ముందూ ఆలోచించి నిర్మించిన చిత్రం. ప్రత్యేకించి వారిద్దరి పాత్రలకున్న బంధుత్వం (అన్నా -చెల్లెలు) దృష్ట్యా ప్రేక్షకాదరణ ఎలా ఉంటుందో అన్నదానిపై తెగ తర్జన భర్జనలు చేసి తెరకెక్కించిన తతంగం. అలాగే మాటలు రచయితగా ముళ్లపూడి వెంకట రమణను ఎంపిక చేయడమూ సాహసమే. రమణ అనగానే ఏదో తెలియని హాస్య స్ఫోరకత్వం విన్నవారి మదిలో మెదులుతుంది. కానీ ఆయన రాయబోయేది సెంటిమెంట్ పాళ్లు కీలకంగా ఉన్న చిత్రం. ఇదీ ప్రయోగమే. ఆ ప్రయోగంలో ముళ్లపూడి వారు మహా భేషుగ్గా నెగ్గుకొచ్చారు. కొన్ని చోట్ల సంభాషణల సంగతి చూస్తే మనసు ఆర్ద్రమవుతుంది. ‘‘నా భర్తగా రాబోయే వాడు నాకు నా అన్న మీద ఉన్న అభిమానాన్ని గౌరవించే వాడయ్యే వాడుండాలి’ అని చెల్లి అన్నమీద తనకున్న ప్రేమను చెప్తుంది. అలాగే మరోచోట ‘మీ ప్రేమ ఉడుకు నెత్తురులో పుట్టుకొచ్చిన ఉద్రేకం’.. అని రాశారు. ఇలాంటి అనేక విశేషాల్ని ఈ కార్యక్రమాలు తెలియజేశాయి. ఈ అంశాన్ని ఆనాడు ప్రధాన దినపత్రికలుకూడా ప్రముఖంగా తమ సినీ పేజీల్లో ప్రచురించాయి. రాసేది ఒక విషయంమీదే కనుక ఇంచుమించుగా ఒకేటైపు రాతలు రావడం (్భషాశైలి కూడా) జరుగుతూనే వుంటుంది, జరిగింది కూడా. కానీ అదే టైపు వాక్య నిర్మాణం, వగైరా రాత్రి చూపించిన దృశ్య ప్రధాన మాధ్యమంలో కూడా వినిపించి కన్పించింది. కనీసం సెంటెనె్సస్‌లో కూడా ప్రత్యామ్నాయ పద్ధతికి వీరెళ్లలేదు. అలాగే అవే అంశాలు అదే రీతిలో చెప్పడంకన్నా, చిత్ర సంబంధీకులతో వారి అనుభవాలూ, అనుభూతులూ చెప్పిస్తే బావుండేది. పోనీ ఇది ఎప్పుడో ఏభై ఏళ్ల క్రితం వచ్చిన అందమైన ముచ్చట కనుక కీలక భూమికలు పోషించిన వారు కాలధర్మం చెందినా వారికి సహాయకులుగా వివిధ శాఖలో పనిచేసిన వారు ఉంటారు కనుక వారితో కార్యక్రమం రూపొందించి వుంటే వైవిధ్యమూ వుండేది. ఇంకా ఆసక్తిగానూ వుండేది. ఆ దిశగా చానల్స్ కాస్త శ్రద్ధ పెట్టి, సృజనాత్మకత జోడించి కార్యక్రమాలు తయారుచేస్తే ప్రసారం చేసే ప్రతి ప్రోగ్రామూ రసభరితంగానే వుంటుంది.
‘‘తొందరగా పనులు పూర్తిచేసేయ్, కరెంట్ పోతే ఇంకే పనులూ కావు...’’
english title:
intentaina reetilo
Date:
Tuesday, November 6, 2012