* నిమ్మరసంలో ఇంగువ పొడి వేసి దంతాలకు రుద్దితే రక్తస్రావం ఆగుతుంది.
* కలబంద గుజ్జులో పసుపు కలిపి శరీరంపై రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
* కవిరి చూర్ణం, నేరేడు చెక్క పొడి, కాస్త ముద్ద కర్పూరం కలిపి మెత్తగా చేసుకుని
దంతాలపై రాసుకుంటే నొప్పి, వాపు, దుర్వాసన వంటివి దూరమవుతాయి.
* బాదం నూనె, ఆలివ్ నూనె మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి అరగంట తర్వాత
స్నానం చేస్తే శిరోజాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
* వెల్లుల్లి పాయలను మెత్తటి పొడిగా చేసి వేడి చేసిన ఆలివ్ ఆయిల్‌లో వేసి బాగా
చల్లార్చాక తలకు రాసుకుంటే జుట్టు నెరిసిపోకుండా ఉంటుంది.
* ఆలివ్ నూనె, కొబ్బరి నూనె సమపాళ్లలో తీసుకుని జుట్టుకు పట్టించి, అరగంట
తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
* చెంచాడు ఆలివ్ నూనెలో కాస్త అల్లం రసం కలిపి జుట్టు కుదుళ్లకు
బాగా పట్టించి, అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
* ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుని తలకు మర్దనా
చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో తలస్నానం చేయాలి.
* నిమ్మరసంలో ఇంగువ పొడి వేసి దంతాలకు రుద్దితే రక్తస్రావం ఆగుతుంది.
english title:
idia
Date:
Saturday, November 10, 2012