Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎక్కడుంది న్యాయం? 36

$
0
0

మరి కొన్నాళ్లు ఓపిక పడితే తన వైపునుంచి సమస్య సానుకూలంగానే పరిష్కారవౌతుందనీ అనుకున్నాడు. ఈ విషయం అఖిలకి వెంటనే చెప్పెయ్యాలని తొందరపడ్డాడు.
మొత్తంమీద పండుగ మూడు రోజులూ సరదాగా గడిచిపోయాయి. రెండుసార్లు అఖిలని వాళ్ల తోటలోనే కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ గడిపాడు పవన్.

16
చౌరస్తాకు ఓ ప్రక్కన రెండడుగుల ఎత్తుగా కట్టిన పిట్టగోడ, ఆ గోడ లోపల లాన్, లాన్ మధ్యలో ఏవేవో మొక్కలున్నాయి. నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ పథకంలో భాగంగా ఆ వార్డు కార్పొరేటర్‌గారు ఏర్పాటుచేసి ప్రారంభించి ఫొటోలు తీయించుకుని పత్రికల్లో వేయించుకున్న కూడలి అది.
అంతకు ముందక్కడ నానాచెత్తతో గలీజుగా ఉండేది. ఆ గలీజు ప్రక్కనే పానీపూరీ, చాట్‌బళ్ళు, మిర్చిబజ్జీ బళ్లు, న్యూడిల్సూ బళ్లూ ఉండేవి. ఇప్పుడు గలీజు పోయి చిన్న పార్కులాగా, పైగా పిట్టగోడ రావడంతో ఆ బళ్ల వ్యాపారులకి వెసులుబాటుగా ఉంది. పిట్టగోడ వాళ్లకి, అక్కడకొచ్చి తినేవాళ్లకి బెంచీలు మాదిరిగా ఉపయోగపడుతోంది.
మధ్యాహ్నం నుంచీ ఆ బళ్లవాళ్లు అక్కడ వ్యాపారం చేసుకుంటూంటారు. వేళాపాళాతో నిమిత్తం లేకుండా కాలేజీలు ఎగ్గొట్టిన స్టూడెంట్స్, ఉద్యోగం సజ్జోగం లేనివాళ్లు అక్కడ చేరుతుంటారు.
అలా చేరేవాళ్లలో జయేందర్, అతడి మిత్రులూ ఉన్నారు. అంతకుముందు ఆడపిల్లల్ని, మహిళల్ని వేధిస్తున్నారని ఛానల్‌లో వార్త వచ్చింది ఆ సెంటర్ గురించే.
ఆ వార్త ప్రసారమై ఐదారునెలలు గడిచిపోవడంతో, ఇటు జనాలు, అటు పోలీసులు మరిచిపోవడంతో మళ్లీ యధావిధిగా జయేందర్ బృందం అక్కడ చేరిపోయింది. ఓ పది పదిహేను రోజులు హడావిడి చేసిన పోలీసులు ఇక చాల్లే అని సర్దుకున్నారు.
వీళ్ల ఆగడాలకి ఆ తోపుడు బళ్ల వ్యాపారులు విసిగిపోయినా వాళ్లు చేయగలిగిందేమీ లేదు. వాళ్లతో గొడవపడి వేగలేమని వీళ్లకీ తెలుసు. కాకపోతే ‘అన్నా యాపారాలు పడిపోతాయన్నా. ప్లీజన్నా..’ అంటూ బ్రతిమిలాడుకోవంతో జయేందర్ బృందం ఆ బళ్ల దగ్గర ఏమీ చెయ్యడం లేదు గానీ, కొంచెం ముందుకెళ్లి ఆడపిల్లల్ని ఏడిపిస్తూన్నారు. అయితే ఎవరికీ వాళ్ల గురించి పోలీసులకి ఫిర్యాదు చేసే ధైర్యం లేదు.
‘ఎవరో వస్తారని ఎదురుచూస్తూ’ కూర్చుని అన్నిటినీ భరించడమే మన జీవన విధానం. అందునా మధ్యతరగతి రాజీ విధానం. ‘‘అద్సరేగాని వొరే జయా! నువీమధ్య మరీ నాటు సరుకు మీద మోజు పడుతున్నావేంట్రా?’’ జయేందర్‌ని అడిగాడు వినోద్.
అప్పుడు జయేందర్ చూపులెక్కడున్నాయో మిగిలిన ఇద్దరు మిత్రులు హర్షద్, తేజ్‌సింగ్‌లు గమనించారు. దూరంగా- పాదాలు కనిపిస్తూ మోకాళ్లకి కొంచెం దిగువగా చీర కట్టుకుని, బిగువుగా జడ వేసుకుని, నుదుటిమీద అర్థరూపాయి బిళ్లకన్నా కాస్త చిన్న సైజు బొట్టు పెట్టుకుని, కళ్లకు నల్లని కాటుక తీర్చి దిద్దుకుని, మెడలో రోల్డుగోల్డు గొలుసూ, చెవులకి మాత్రం చిన్న బంగారు దుద్దులూ పెట్టుకుని, చూడగానే ఆకర్షించే స్తనద్వయంతో, మరీ సన్నమూ గాని, మరీ బొద్దుగా గానీ శరీర సౌష్టవంతో, చేతిలో ప్లాస్టిక్ బుట్టతో వస్తున్నామెను చూశారంతా!
ఆమెనే జయేందర్ చూస్తున్నాడని వాళ్లకి బాగానే అర్థమయ్యింది.
‘‘స్టన్నింగ్ నాటు బ్యూటీ అంటే ఇదేరా’’ హర్షద్ అన్నాడు కసిగా.
‘‘ఏందిరా మీరంతా పాగల్ లెక్కున్నారు బయ్... టీవీ యాంకర్లు, సిన్మాల్లో ఎగస్ట్రాలు ఉండగా ఈ నాటు టేస్టేంటి బయ్?’’ తేజ్‌సింగ్ అన్నాడు.
‘‘పోరా నాటు సంగతి నీకేం తెల్సని? నువ్వు జెప్పేటువన్నీ తెచ్చిపెట్టుకున్న అందాలు. డూప్లికేట్లు. మన పాకెట్లో ఎంతున్నా చాల్దు.. అదే ఈ నాటు బ్యూటీ అనుకో పాకెట్ అంత ఖర్చు కాదు. సుఖానికి సుఖమూ ఉంటుంది...’’ హర్షద్ అన్నాడు.
‘‘హర్షద్‌గాడు చెప్పింది కరక్టురా... అసలు దాని బ్యూటీ చూడు!...’’ జయేందర్ అన్నాడు కాస్త దగ్గరికొచ్చిన ఆ అమ్మాయినే చూస్తూ.
‘‘అది సరేగాని హర్షూ... మొన్న ఆంటీ ఏమందిరా? కూడా వెళ్లావ్... ’’ వినోద్ అడిగాడు.
‘‘ఓ థౌజెండ్ ఇస్తావా అనడిగింది’’ హర్షద్ చెప్పాడు.
‘‘రేటా?!’’
‘‘కాదు... అప్పట!’’
‘‘అలాగే అన్నా... ముందు పనికానివ్వమన్నా...’’
‘‘ఏవంది?’’
‘‘చూద్దాం అని వెళ్లిపోయింది’’
వినోద్ భళ్లున నవ్వేశాడు. ఇంతలో ఆ అమ్మాయి వీళ్ల దగ్గరకొచ్చేసింది.
‘‘హలో ఎక్కడ పనే్జస్తున్నావ్?’’ జయేందర్ అడిగాడా అమ్మాయిని.
ఆమె ముఖం అటు తిప్పేసుకుని విసవిసా వెళ్లిపోయింది. ఆమె ఆటో డ్రైవర్ పోతురాజు భార్య కనకమాలచ్చిమి!
వారం రోజులుగా జయేందర్ ఆమె వెంట పడుతున్నాడు. ఉదయం, సాయంత్రం ఆమె వచ్చే సమయానికి అక్కడ చేరుతున్నాడు. ఆమెకేసి చూసి నవ్వుతున్నాడు. కళ్లతో సైగలు చేస్తున్నాడు.
ఇంకా అతడు వెర్రిమొర్రి చేష్టలు ఏం చేస్తాడోనని ఆమెకు భయంగా ఉంది. ఆమధ్య కొన్నాళ్లు ఈ గొడవ లేకపోయేసరికి ఆమె ఊపిరి పీల్చుకుంది. మళ్లీ వీళ్ల ఆగడాలు మొదలయ్యేసరికి ఆమెకు భయం వేస్తోంది.
అసలు తన వెంట వాళ్లు ఎందుకు పడుతున్నారో ఆమెకు అర్థం కావడంలేదు. కనుసైగ చేయగానే వచ్చి బైకు ఎక్కేసే అమ్మాయిలు ఎంతోమంది ఉండగా పల్లెటూరిదైన తన వెంట పడడం ఏమిటో ఆమెకు అర్థం కావడంలేదు. బస్సుస్టాపుల్లో అలా అబ్బాయిల బైకులెక్కి వెళ్లిపోయే ఎంతోమంది అమ్మాయిల్ని చూస్తోందామె. ఇంత బరితెగించిపోయారా అని చాలాసార్లు ఆమె బుగ్గలు నొక్కుకుంది ఆశ్చర్యపడుతూ.

-ఇంకాఉంది

మరి కొన్నాళ్లు ఓపిక పడితే తన వైపునుంచి సమస్య సానుకూలంగానే పరిష్కారవౌతుందనీ అనుకున్నాడు.
english title: 
yekkadundi nyayam
author: 
సర్వజిత్

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>