‘నేను’ ఎవరు?
నేను ఎవరికి?
నేను ఏమిటి?
నేను ఎందుకు?
నేను ఎక్కడికి?
పైకి కనిపించే ‘నేను’లో అంటే మనలో అయిదు తత్వాలు. ప్రాపంచికమైన అయిదు తత్వాల సంగమం మన ఈ దేహం. కాబట్టి మానవ దేహంలో మనం పాంచభౌతికులం. కనిపించే మన రూపంలో వ్యక్తిత్వం ఉంది... మనస్తత్వం ఉంది... శరీర తత్వం ఉంది. ఈ మూడు తత్వాల ‘నేను’ ఎప్పటికప్పుడు సంఘర్షణకు లోనవుతూ ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది. సమాధానాలు ఎన్ని పుట్టుకు వస్తున్నా నేను అనే ప్రశ్న ఒక అనే్వషణగా మళ్లీ మళ్లీ బలం పుంజుకుంటోంది. నేను అంటే ఒకానొక ‘స్థితి’-బీయింగ్-అని చెప్పుకుంటున్నా ఆ స్థితి ‘విశ్వ స్థితి’-యూనివర్సల్ బీయింగ్ అయిపోతోంది. ఈ మానవ రూపం శాశ్వతం కాదు కదా! ఎరుకతో మిన్నకుందామనుకున్నా నేను ‘శూన్యం’ అయిపోతోంది. ఈ శూన్యత్వమే విశ్వత్వమా?!
నేను ‘రూపం’ అన్నది ఒక విధంగా స్పష్టం... నేను ‘అరూపం’ అన్నది ఇంకొక విధంగా స్పష్టం. నేను ‘దృశ్యం’ కావటం ఎంత వాస్తవమో నేను ‘అదృశ్యం’ కావడమూ అంతే వాస్తవం. నేను ‘స్థితి’ అనుకోవడం ఎంత యదార్ధమో నేను ‘శూన్యం’ అనుకోవడమూ అంతే యదార్ధం. నేను ‘మనస్తత్వం’ రాసుకోవడం భ్రమ కాదు... అలాగే ‘వ్యక్తిత్వం’ అనుకోవడమూ భ్రమ కాదు... వ్యక్తిత్వం మనస్తత్వం కలగలిసిన ‘మానవతత్వం’ అనుకోవడమూ భ్రమ కాదు. అయినా భ్రమిస్తూనే ఉన్నాం.
మన ‘భ్రమ’కు ‘మేథ’ తోడవుతోంది...్ఫలితంగా పరిణమిస్తున్నాం. ఈ పరిణామ తత్వం మనకు నాలుగో ముఖం అవుతోంది. ఈ పరిణామ తత్వంతో మనం ఇంకా ఇంకా ఎదగాలనుకుంటుంటాం. ఈ ఎదిగే తత్వంతో మనం భౌతికంగా ‘సూపర్’మాన్-సూపర్ ఉమన్ అవుతున్నాం. అధిభౌతికంగానో, ఆధ్యాత్మికంగానో, స్పిరిట్యుయల్‌గానో ‘సూప్రా’ పర్సనాలిటీ మనదవుతోంది. దీనే్న దివ్యత్వం అంటున్నాం. ఇటువంటి బహుముఖీన ప్రయత్నాలతో దృశ్య, అదృశ్యాలను సైతం అందుకోగలుగుతున్నాం. మనదైన స్వభావానికి జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన ప్రభావాలు తోడుకావడంతో ఈ భౌతిక, అధిభౌతిక తత్వాలు ప్రభవిస్తున్నాయి.
కాలంతో, ప్రకృతితో పరిణామ తత్వం మమేకం కావడంతో మనలో మహోన్నత వ్యక్తిత్వం-సూప్రా పర్సనాలిటీ పురుడు పోసుకుంటోంది. కాలంలో నిలబడగలిగితేనే ఈ మహోన్నత వ్యక్తిత్వం రాణించగలిగేది. కాలం విలువను తెలుసుకోకుండా, ప్రకృతిని తృణీకరిస్తుంటే ‘నేను’ కొట్టుకుపోతూ నిలువ నీడలేనిదవుతుంది. అసామాన్యంగా పరిణమించడానికి బదులు అతి సామాన్యంగా నేను అంతరించాల్సి వస్తుంది.
మన ‘అసామాన్యత’లో హఉ నిఉ్గ్ళఉ ఱఉజీఉఉ జ్గెన్గికూ ఉత్గ్జ్గిన్గికూ నిడ హ జనిజఉ ఉత్గి అని అనుకున్నప్పుడు-ఆ లిటిల్ ఎక్‌స్ట్రానే ‘సూపర్’, ‘సూప్రా’ అవుతున్నప్పటికీ- ‘నేను’ మాత్రం ప్రశ్నల పరంపర అవుతూనే ఉంది. జీవితమే సమాధానాల పుట్టలా కనిపిస్తున్నా జీవన వేగంలో సమాధానాల వేగం కంటే ప్రశ్నల వేగమే అధికమవుతోంది. కారణం ‘నా’లో రెండు అభిప్రాయాలు ఎల్లప్పుడూ తలపడుతుండడం వల్లనే. ‘అవును’ అనుకునే లోపు ‘కాదు’ అన్న తలపు చోటు చేసుకుంటుంటుంది. ‘ఇదికాదు.. అది’ అనుకునే సందిగ్ధతలో స్థిరత్వం చోటు చేసుకోదు. పైగా మనది ‘నా’ అభిప్రాయమే. మన చూపు ప్రాపంచికానికి పరిమితమై ఉన్నంత కాలం కనిపించే దానే్న విశ్వసిస్తాం... అయినా అనే్వషణా రూపంలో కనిపించనిదీ మనల్ని విశ్వసించేలా చేస్తుంటుంది. అందుకే రెండు అభిప్రాయాలు మన నుండి వ్యక్తమవుతుంటాయి. అయినా ‘నా’ అభిప్రాయం ప్రకటితమవుతున్నప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం అనే కదా! అభిప్రాయం మనలదే కాబట్టి ‘నా వరకు నాకు సంపూర్ణం’ అనిపించినా అందరికీ సంపూర్ణం కాకపోవచ్చు. అంతెందుకు మనకే పైకి సంపూర్ణ్భాప్రాయం అనిపించినా ఎంతో కొంత అస్పష్టత, సందిగ్ధత చోటు చేసుకుని ఉండడంతో అసంపూర్ణ్భాప్రాయమూ అని అనిపిస్తుంటుంది. అయినా రాజీపడి సంపూర్ణ్భాప్రాయంగానే పరిగణిస్తుంటాయి.
ఇంతకీ మన అభిప్రాయాలకి కారణం ‘నా ఎరుక’, ‘నా జ్ఞానం’, ‘నా తెలివి’.మనలో గూడుకట్ట్టుకున్న కొన్ని అంశాలతో సరిచూసుకోవడం వల్ల వ్యక్తమైన అభిప్రాయం అది. ఒకవిధంగా మానసికం... అంటే మన మనసు పసిగట్టిన భావ పరంపర... ఇంకా చెప్పాలంటే మనసు అందుకోగలిగిన అంశాల సమాహారం. అంతేకాదు మన అభిప్రాయమే ‘అది’ అని కాదు. ఇలా ఆలోచిస్తే కనిపించేది వాస్తవం.. యదార్ధం.. స్పష్టం. దాన్ని వ్యక్తీకరించడానికి చేసే ప్రయత్నంలో కొంత అస్పష్టతకు అవకాశం ఏర్పడుతుంది.
ఒక విధంగా ఈ వ్యక్తీకరణ మన దృష్టితో సంకుచితం అయిపోతోంది. లేదా విస్తృతం అయినా అవుతోంది. వందకు వంద శాతం వ్యక్తం కావడంలేదు. వందకు నూట అయిదు మార్కులు పడ్డా... వందకు తొంభై మార్కులు పడ్డా లొసుగు ఉన్నట్లే లెక్క తప్పినట్లే. ఒకవిధంగా చెప్పుకోవాలంటే, మన ఆలోచన వ్యక్తీకరణ రూపం భరించేప్పటికి కొంత ‘మాయ’లో పడుతోంది. కొంత అస్పష్టతకు లోనవుతోంది...కమ్యూనికేషన్ గాప్ ఏర్పడుతోంది. కాబట్టి కళ్లముందు ఉన్నది వ్యక్తమయ్యే తీరులో మార్పు ఉంటోంది. మనలోని ద్వంద్వ దృష్టి సైతం అసమగ్ర వ్యక్తీకరణకు కారణం అవుతోంది. దానే్న ‘నేను-అది’ అంటుంటాం...‘స్వ-పర’ అంటేనూ ఇదే. అంతేకాదు ‘నేను’లో సైతం ‘స్వ-పర’ ఉంటుంది.
భౌతికంగా కనిపించే ‘నేను-పర’లకు ప్రాపంచిక బంధం ఏదో ఉంటూనే ఉంటుంది. అలాగే మనలోని ‘స్వ-పర’లకు సైతం ఈ బంధం ఉంటుంది. మనలోని ‘స్వ’ వ్యక్తమవుతున్నప్పుడు ఒక విధమైన అభిప్రాయానికి వస్తాం..‘పర’ వ్యక్తమవుతున్నప్పుడు ఇంకొక విధమైన అభిప్రాయానికి వస్తాం. ఇలా నేనులోని స్వ-పరాలు ద్వంద్వాలు అవుతుంటాయి. ఈ రెండు వేటికి అవి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉండాలి అని అనుకుంటాయి. కానీ మనసు రెండింటినీ ఒకే గాటకు కట్టిపడేస్తుంటుంది. కాబట్టి ఒకే కోణంలో రెండింటి దృష్టి ప్రసరించడం లేదు. ఇదే మనలోని వైరుధ్యత..వైవిధ్యత. ఏకాభిప్రాయానికి రాలేకపోవడానికి కారణమూ ఇదే! మనం స్వ-పరాలుగా విడిపోక ఆ రెండూ సంగమించిన స్థానం నుండి చూడగలిగితే ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. ఏకాగ్రత కుదరడం అంటే ఇదే!
ఏకాగ్రత పరంగా మనం స్వభావంనుండి విడిపోకూడదు... ప్రపంచంనుండి విడిపోకూడదు... అంటే బంధాన్ని తెంచుకోకూడదు కానీ ఆ బంధమే సర్వస్వం, శాశ్వతం అనుకోకూడదు. ప్రభావాల, స్వభావాల మూలాన్ని చేరుకోవాలి. ఒక విధంగా మన ధ్యాసను వెనక్కు మళ్లించడం... మూలాలను చేర్చటం... అక్కడి నుండి దృష్టి పెట్టడం. మనం స్వభావాన్ని అంటిపెట్టుకుని ఉన్నంత కాలం చంటిపిల్లలమే! ప్రభావాలనుండి వెనక్కు మరలడం వల్ల పసికూనలమే! ఈ ‘పసి’తనంతో చూడగలిగితే అభిప్రాయ మూలం చేరుకోగలుగుతాం... ఎంతలా ప్రాపంచికమైనా, ఎంతలా మానసికమైపోతున్నా భ్రమాన్వితం కాము... మనలోని పారదర్శక వ్యక్తిత్వానికి ఈ ప్రయాణం, ఈ పరిణామం చాలు.
‘నేను’ ఎవరు? నేను ఎవరికి?
english title:
vinu naa maata
Date:
Sunday, November 18, 2012