నెల్లూరు, నవంబర్ 18: పదేపదే వస్తున్న విమర్శలతో ఇక చేసేదేమి లేక అవిశ్వాసం పెడుతున్నట్లు చంద్రబాబునాయుడు వెల్లడిస్తున్నారే తప్ప ఆయన ఆ మాట నిలబెట్టుకునే వరకు సందేహాస్పదమేనని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహనరెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరుజిల్లా చిల్లకూరు మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంపి మేకపాటి నేతృత్వంలో ఆదివారం వైఎస్‌ఆర్‌సిలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎంపి మేకపాటి మాట్లాడుతూ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రెండొందలకుపైగా సీట్లు దక్కడం తధ్యమనే సంగతి ‘దేశం’ అధినేత చంద్రబాబుకు స్పష్టంగా తెలుసన్నారు. అందువల్ల ఆయన కిరణ్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వరకు అనుమానేనని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ నెల 22నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటరీ శీతాకాల సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. దీంతో వచ్చే మే నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగొచ్చని మేకపాటి జోస్యం చెప్పారు.
దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలి:
బాబుకు బాలినేని సవాల్
ఒంగోలు అర్బన్: చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే వెంటనే కిరణ్‌సర్కార్‌పై అవిశ్వాసం పెట్టాలని రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు శాసన సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం తన నివాసంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గతంలో చంద్రబాబు నాయు డు పెట్టిన ఆవిశ్వాస తీర్మానానికి తమపార్టీ శాసన సభ్యులు మద్దతు పలికారని గుర్తు చేశారు.
తమ శాసన సభ్యులపై వేటు పడుతుందని తెలిసి కూడా చంద్రబాబు పెట్టిన ఆవిశ్వాసానికి మద్దతు ప్రకటించామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వాన్ని పడగొట్టకుండా తమపార్టీ శాసన సభ్యులపై వేటువేసేందుకే చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. నిజంగా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని బాలినేని డిమాండ్ చేశా
ఎంపి మేకపాటి ఎద్దేవా
english title:
ba
Date:
Monday, November 19, 2012