కలికిరి, నవంబర్ 18: సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్వగ్రామం చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో మంజూరైన సైనిక్ స్కూల్ భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. శనివారం కలికిరికి వచ్చిన సిఎం రాత్రి స్వగ్రామం నగరిపల్లెలో బసచేశారు. ఆదివారం ఉదయం ఉదయం 8గంటలకు స్వగృహం వద్దకు వచ్చిన సందర్శకులతో మాటామంతి కలిపారు. అనంతరం 9.15గంటలకు బయలుదేరి కలకడ మార్గంలో సైనిక్‌స్కూల్ భవన నిర్మాణానికి కేటాయించిన 60ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. భవన నిర్మాణానికి ఇదివరకే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు రూ.60కోట్లు మంజూరు చేసినట్టు వివరించారు. వచ్చే ఏడాదికల్లా భవన నిర్మాణం పనులు పూర్తయ్యే విధంగా పనులు నిర్వహించాలని ఉన్నతస్థాయి అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ఆరా తీశారు. సిఎం వెంట ప్రత్యేక కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరి వినయ్, జిల్లా కలెక్టర్ తదితరులున్నారు.
అధికారులకు ముఖ్యమంత్రి కిరణ్ ఆదేశం
english title:
s
Date:
Monday, November 19, 2012