కోడుమూరు, నవంబర్ 18: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో ప్రవేశపెట్టిన పథకాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూట్లు పొడిచారని వైకాపా నాయకురాలు షర్మిల ఆరోపించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా కర్నూలు జిల్లా సి.బెళగల్‌లో ఆదివారం జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ రానున్న రోజుల్లో రాష్ట్రంలో మనుగడ సాధించలేమన్న భయంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించాయని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకున్నా బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా జగనన్న త్వరలో ప్రజల ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్వాకం వల్లే రాష్ట్రంలో కరెంట్ సమస్య తలెత్తిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు, సర్‌చార్జీలు భారీగా పెంచి ప్రజలపై పెనుభారం మోపారన్నారు. కరెంటు లేక ప్రజలు చీకట్లో మగ్గుతున్నారన్నారు. ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేశారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారంటే అది రాజశేఖరరెడ్డి పుణ్యమేనన్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతోనే హంద్రీ నీవా పథకానికి రాజన్న శ్రీకారం చుట్టారని ఆమె గుర్తు చేశారు. బాబు చేస్తున్న పాదయాత్రకు అర్థం లేదని, బాబు హయంలోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు.
ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం
english title:
ys
Date:
Monday, November 19, 2012