ఇచ్ఛాపురం, నవంబర్ 18: శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలంలోని అరకపద్ర గ్రామానికి చెందిన అశోక్ బెహరా, డోర్మ బెహరా దంపతులకు శనివారం రాత్రి తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. తాపీమేస్ర్తిగా పనిచేస్తున్న ఆశోక్ భార్య డోర్మి ప్రసవం కోసం శనివారం రాత్రి స్థానికంగా ఉన్న ఒక ప్రెవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో ఆమె సుమారు మూడు ఇంచుల తోక ఉన్న బాలుడుకు జన్మనివ్వడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. అశోక్, డోర్మి దంపతులకు ఇది నాలుగో సంతానం. ముందున్న వారంతా అందరిలాగే ఉన్నారని తల్లిదండ్రులు చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా, ఇచ్ఛాపురం మండలంలోని అరకపద్ర గ్రామానికి చెందిన
english title:
i
Date:
Monday, November 19, 2012