గరుగుబిల్లి, నవంబర్ 19: తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సరఫరా చేస్తున్న సాగునీటిని ఈ నెలాఖరు నుంచి నిలుపుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. కాలువల పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించి ప్రస్తుతం వరి పంటలు పంట దశకు వచ్చాయి. దీంతో సాగునీరు అవసరం లేనందువల్ల గడిచిన కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ అధికారులు సాగునీటి సరఫరాను తగ్గించారు. అయితే ఆర్.జి. ఎల్, సాంబమసూరి తదితర రకాల పంటలకు సాగునీరు అవసరమని రైతులు తెలియజేయడంతో కొంతమేర సాగునీరు సరఫరా చేస్తున్నారు. వరి పంటలు పంట దశకు రావడంతో అపరాల పంటలైన పెసర, మినుము పటలను వేసిన అనంతరం కోతలు ప్రారంభించనున్నామని పలువురు రైతులు తెలిపారు. పలు గ్రామాల రైతులకు సాగునీరు అవసరం లేనందువల్ల కాలువల ద్వారా సరఫరా చేస్తున్న సాగునీటిని కొంతమేర తగ్గించామని రెగ్యూలేటర్ ఐ.జి. శంబంగి తిరుపతిరావు తెలిపారు. ఈ నెలాఖరు నుంచి సాగునీటి సరఫరాను నిలుపుదల చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
‘ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 19: ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎం.పి.బొత్స ఝాన్సీలక్ష్మి కోరారు. సోమవారం ఇక్కడ జిల్లా కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయపార్టీలు ఎన్నికలపై దృష్టిని సారిస్తున్నాయన్నారు. కేంద్రంలోను, రాష్ట్రంలోను కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఇక నుంచి ప్రతీ అయిదేళ్లకు సభ్యత్వనమోదు చేస్తున్నందున పట్టణ, గ్రామస్థాయిలో సభ్యత్వనమోదుపై ప్రత్యేకంగా దృష్టిని సారించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు కె.దామోదర్, డి. జగన్నాధం, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి, పిళ్లా వినాయకమ్మ పాల్గొన్నారు.
‘ఎఫ్‌డిఎ పెంపుతో ఆర్థిక వ్యవస్థకు దెబ్బ’
విజయనగరం (్ఫర్టు), నవంబర్ 19: ప్రభుత్వరంగ సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డిఐ)ల పెంపుదల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, విజయనగరం బ్రాంచ్ ప్రధాన కార్యదర్శి యు.సీతారామరాజు అన్నారు. ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డిఐ పెంపును వ్యతిరేకిస్తూ విజయనగరం ఎం.పి.బొత్సఝాన్సీలక్ష్మికి సోమవారం వినతిపత్రం అందజేశారు. రాబోయే పార్లమెంటు శీతకాల సమావేశాల్లో ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డిఐ పెంపును 26 నుంచి 49శాతానికి పెంచడాన్ని వ్యతిరేకించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ యూనియన్ అధ్యక్షుడు పి.అప్పారావుతదితరులు పాల్గొన్నారు.
‘గ్రీవెన్స్’లో వినతుల వెల్లువ
విజయనగరం(టౌన్), నవంబర్ 19 : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్‌కు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన అర్జీదార్లు సుమారు 200 వినతులను అందజేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ పిఎ శోభ, ఎస్సీ కార్పొరేషన్ ఇడి మనోరమ వినతులు స్వీకరించారు. పార్వతీపురం అర్‌డబ్య్లుఎస్ నీటి నాణ్యతా పరీక్ష ప్రయోగశాలలో పని చేస్తున్న తమకు 7 నెలలుగా జీవాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్వందించి న్యాయం చేయాలని కోరుతూ టి. లక్ష్మణరావు తదితరులు కోరారు. పార్వతీపురం మండలం డోనిశేల గ్రామ గిరిగనులమైన తమకు గొర్రెల పెంపకానికి ప్రభుత్వరుణం మంజూరు చేయాలని కొంతమంది మహిళలు కోరారు. జామి మండలానికి చెందిన ఎస్సీ మహిళలపై దాడులు పెచ్చుమీరి నందున అధికారులు స్పందించిన రక్షణ కల్పించాలని కె కన్నమ్మ తదితరులు ఫిర్యాదు చేశారు. రామభద్రపురం మండలం కొట్టక్కి ఎస్సీ కాలనీలో ఏడాది నుంచి చేతి పంపు పని చేయక మంచి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే సమస్య పరిష్కరించాలని పలువురు అభ్యర్ధించారు. వికలాంగ ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని గరివిడికి చెందిన జి నర్సింహమూర్తి, వికలాంగుల పింఛన పునరుద్ధరించాలని దత్తిరాజేరు మండలం రామ చంద్రపురానికి చెందిన బి. తిరుపతి, బొండపల్లి మండలం బి, రాజేరుకు చెందిన ఎస్ అమ్ములు వినతి నిచ్చారు. విజయనగరం రెండవ వార్డు బిట్ 2 రేషన్ డిపో డీలర్ తమకు నాలుగు నెలల నుంచి సరుకులు ఇవ్వడం లేదని బి ఉష ఫిర్యాదు చేశారు.
తోటపల్లి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సరఫరా చేస్తున్న
english title:
n
Date:
Tuesday, November 20, 2012