విజయనగరం(టౌన్), నవంబర్ 19 : పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఇంధన సర్‌చార్జీల ను ప్రభుత్వం పెంచడాన్ని నిరసిస్తూ విద్యుత్ బిల్లులను తగుల బెట్టారు. ధర్నాకు నాయకత్వం వహించిన ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ సాంబశివరావు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపుదలతో ప్రజలపై కోట్లాది రూపాయలు భారాన్ని ప్రభుత్వం మోపడం దారుణ మన్నారు. మరో మారు భవిష్యత్‌లో సర్దుబాటు, రెగ్యులర్ చార్జీలు వేసే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. ఆరకమైన విధానాలను ప్రభుత్వం విడనాడకపోతే ప్రజనే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిదారి పట్టిస్తారన్నారు. ప్రజలపై భారం మోపకుండా విద్యుత్ చార్జీల పెంపు, సర్‌చార్జి వసూలును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి బుగత అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం శ్రీనివాసరావు, బి గిరి, సతీష్, ఎల్ బాష తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఈ మేరకు జాయింట్ కలెక్టర్‌కు వినపత్రం అందేశారు.
పెంచిన విద్యుత్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేస్తూ భారత
english title:
p
Date:
Tuesday, November 20, 2012