భూదాన్‌పోచంపల్లి, జనవరి 27: భూదాన్‌పోచంపల్లి మండలంలో శుక్రవారం 12 దేశాలకు చెందిన 47 మంది ప్రతినిధులు పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలు పల్లెల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరాలను తెలుసుకున్నారు. తొలుత స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థలో సంస్థ చేబడుతున్న శిక్షణా కార్యక్రమాలను చైర్మన్ డాక్టర్ ఎం.సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. గ్రామాల అబివృద్ధి పై పరిపాలన తీరుతెన్నులను జలాల్పురం ను సందర్శించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పర్యాటన కేంద్రం, చేనేత సహకార సంఘం తదితర ప్రాంతాలను సందర్శించి భారతీయ సంసృతిని తెలుసుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డీనేటర్ ఆచార్య, డైరెక్టర్ కిషోర్‌రెడ్డి, హన్మంతరావు, రవీందర్, సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి మండలంలో శుక్రవారం 12 దేశాలకు చెందిన 47 మంది ప్రతినిధులు
english title:
pochampally
Date:
Saturday, January 28, 2012