Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఇంజనీరింగ్ అధికారులపై ఆర్‌డి ఆగ్రహం

$
0
0

విజయనగరం , నవంబర్ 22: పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులపై మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ ఆశాజ్యోతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు పుష్కలంగా ఉన్నా, పనులు చేసేందుకు టెండర్లను ఎందుకు పిలవడంలేదని మున్సిపల్ ఇంజనీర్ బాబును నిలదీశారు. అలాగే మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ల పనితీరుపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశాజ్యోతి మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు తమ పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ‘ మీ ఇంజనీర్లు ఎక్కడ’ అంటూ మున్సిపల్ కమిషనర్ గోవిందస్వామిని అడగడంతో ఇంజనీర్లకు ఫోన్ చేసి సమావేశానికి రప్పించారు. సమావేశం ప్రారంభించిన గంట సమయం తర్వాత ఇంజనీరింగ్ సమావేశా నికి హాజరయ్యారు. దీంతో వారిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాలుగు మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధిపనులను సమీక్షించారు. నీలం తుఫాన్ వల్ల దెబ్బతిన్న రోడ్లకు, రక్షిత మంచినీటి పథకాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రజారోగ్యశాఖ డిప్యూటీ ఎస్‌ఇ కృష్ణారావు, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్లు గోవిందస్వామి, చంద్రిక, సుబానీ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయం
విజయనగరం, నవంబర్ 22: మహిళల ఆర్ధిక స్వావలంబనే ధ్యేయంగా జిల్లాలో మహిళా కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి మహిళా కార్యక్రమం అమలును పరిశీలించేందుకు జిల్లాకు వచ్చిన ప్రతినిధి అస్మితబాస్‌తో స్థానిక జెడ్పీ సమావేశమందిరంలో ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో అమలు చేస్తున్న మహిళా సాధికార కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈసందర్భంగా కలెక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల పరిధిలోని 75 గ్రామాల్లో ఐక్యరాజ్య సమితి మహిళా కార్యక్రమాలు చేపట్టినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకూ 36 గ్రామసభలు, 36 మహిళా సభలు, 187 వార్డు సభలు జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమాల వల్ల మహిళల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. జిల్లాలో 30 వేల మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కాగా సుమరు 3.5 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. 1995-96 సంవత్సరంలో స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేయగా ఇప్పటి వరకూ వీటికి బ్యాంకు లింకేజిగా 16వేల కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చినట్టు కలెక్టర్ వివరించారు. ప్రతి నెలా జిల్లా మహిళా సమాఖ్య సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు వారిలో పొదుపు చేయడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించడం జరిగిందన్నారు. సాక్షర భారత్ కార్యక్రమంలో సుమారు 5 లక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈరెండు అంశాల్లో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డులు లభించిన విషయాన్ని కలెక్టర్ ఐకాస ప్రతినిధి అస్మితకు వివరించారు. ఇక జిల్లాలో రెండేళ్ళకు పైగా నిర్వహిస్తున్న గ్రామసందర్శన కార్యక్రమం వల్ల మహిళల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చిందన్నారు. గ్రామాన్ని సందర్శించే అధికారులకు తామెదుర్కొంటున్న సమస్యలు వివరించడంతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు కోరుతున్నారని, ఇది మహిళల్లో వచ్చిన చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. డిఆర్‌డిఎ ఇన్‌ఛార్జ్ పథక సంచాలకులు డి.శ్రీరాములు నాయుడు మాట్లాడతూ స్వయం సహాయక సంఘాల పనితీరు, వారికి కల్పిస్తున్న ఉపాధి పథకాలను వివరించారు. మహిళా శిశు సంక్షేమ అధికారి ఎ.ఇ.రాబర్ట్స్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం సరఫరా వంటి అంశాలను వివరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ పి.ఎ.శోభ, జెడ్పీ సిఇఓ మోహనరావు, అపార్ట్స్ ప్రతినిధి సునీత, ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం జిల్లా ప్రాజెక్టు అధికారి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

‘పాత తెలుగు సినిమాల ప్రదర్శనకు ఏర్పాట్లు’
విజయనగరం, నవంబర్ 22: ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక చర్యల్లో భాగంగా చేపట్టే కార్యక్రమాల్లో ప్రజాదరణ పొందిన పాత తెలుగు సినిమాల ప్రదర్శన ఏర్పాటు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ పి.ఎ.శోభ అధికారులకు సూచించారు. సినిమా ధియేటర్ల యజమానులతో ఆమె తన ఛాంబర్‌లో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జె.సి మాట్లాడుతూ తెలుగుజాతి గొప్పతనం తెలిపే పాత సినిమాలను ప్రతి మంగళవారం ధియేటర్లలో ప్రదర్శించాలని కోరారు. డిసెంబర్ 27 నుంచి మూడు రోజుల పాటు తిరుపతిలో ప్రపంచ తెలుగుమహాసభలు జరుగుతున్నాయని, ఈ సభల సన్నాహ సూచకంగా జిల్లాలో డిసెంబర్ 19 వరకూ పలు కార్యక్రమాలను చేపట్టినట్టు ఆమె వెల్లడించారు. తెలుగుభాష, తెలుగు చరిత్ర, సంస్కృతిలకు అద్దం పట్టే చిత్రాలను ప్రతివారం ప్రదర్శించాలన్నారు. వారంలో నాలుగు సిన్మాధియేటర్లలో వీటిని ప్రదర్శించాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి బి.సి.హెచ్ వెంకటరావు మాట్లాడుతూ తెలుగజాతి, భాష, సంస్కృతులపై నేటి బాలలకు, యువతకు ఆసక్తి కలిగే విధంగా పాత చలనచిత్రాలను ప్రదర్శించాలన్నారు. సమావేశంలో అధికార భాషా సంఘం సభ్యుడు ఆచార్య ఎ.గోపాలరావు, సిన్మా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.

26 నుంచి డిసిసిబిలో ఆన్‌లైన్ సేవలు

విజయనగరం , నవంబర్ 22: వాణిజ్యబ్యాంకులతో సమానంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కూడా ఆన్‌లైన్‌సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో ఉన్న 16 సహకార బ్యాంకు బ్రాంచ్‌లతోపాటు జిల్లా ప్రధాన కార్యాలయంలో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్), కంప్యూటీకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఈనెల 26వ తేదీన అధికారికంగా ఆన్‌లైన్‌సేవలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం ఇక్కడ తన చాంబర్‌లో సిఇఒ విఎస్‌ఎస్ ప్రసాద్ ఆన్‌లైన్‌సేవలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా శివశంకర ప్రసాద్ మాట్లాడుతూ బ్రాంచ్‌ల నుంచి జిల్లా ప్రధాన కార్యాలయానికి ఆన్‌లైన్‌సేవలు అనుసంధానం చేస్తామన్నారు. ఆన్‌లైన్‌సేవలు అందుబాటులోకి వస్తే గ్రామస్థాయిలో రైతులకు, బ్రాంచ్‌పరిధిల్లో వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఏ బ్రాంచ్‌లోనైనా తమ నగదునిల్వలు, ఖాతావివరాలను తెలుసుకోవచ్చునని తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటీకరణ చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే చాలా సంఘాల్లో ఈ ప్రక్రియ పూర్తయిందన్నారు. అన్నమరాజుపేట, కెల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో బంగారునగల హామీపై రుణాలు ఇచ్చేందుకు 30లక్షల రూపాయల ఆర్థికసాయం చేయాలని కోరుతూ నాబార్డుకు ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌జనరల్‌మేనేజర్ సిహెచ్.ఉమామహేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

సద్దుమణిగిన ఎన్.సి.ఎస్. వివాదం
సీతానగరం, నవంబర్ 22: ఎట్టకేలకు ఎన్.సి.ఎస్. సుగర్ ఫ్యాక్టరీ వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఫ్యాక్టరీ కార్యాలయంలో ఫ్యాక్టరీ అధికారులతో చర్చలు జరిగాయి. ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ చెరకు రైతు సంఘం నాయకులు మూడు డిమాండ్‌లను ప్రస్తావించారు. రైతుల అనుమతి లేకుండా వాడుకున్న రుణాలకు యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాం డ్ చేశారు. సి.ఇ.ఓ. ఆంజనేయులు మాట్లాడుతూ యాజమాన్యం వాడుకున్న రుణాలకు బాధ్యత వహిస్తు బ్యాంకులకు రైతులతో సంబంధం లేకుండా హామీ పత్రాలు సమర్పిస్తామన్నారు. చెరకు మద్దతు ధర 3వేలు రూ పాయలు చెల్లించాలని, సి.పి.ఎం. జిల్లా కార్యదర్శి ఎం.కృష్ణమూర్తి అన్నారు. చెరకు మద్దతు ధర విషయాన్ని ఎం. డి.తో చర్చించి ప్రకటిస్తామని సి.ఇ.ఓ. తెలిపారు. రైతులకు బకాయి ఉన్న రాయితీలు 3కోట్ల రూపాయలను తక్షణమే చెల్లించాలని రైతు సంఘం సభ్యు లు డిమాండ్ చేయగా ఈనెల 27వ తేదీలోగా చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు. వచ్చే క్రషింగ్ సీజన్‌లోనైన రైతులకు ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని బొబ్బిలి మాజీ మున్సిపల్ ఛైర్మన్, వై.కా.పా. నాయకులు బేబీనాయన కోరారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఇకపై ఏ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని సి.ఇ.ఓ. కోరారు. దీంతో చెరకు రైతుల దీక్షలను విమర్శిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి చెరకు క్రషింగ్ లాంఛనప్రాయంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే సవరపు జయమణి, దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి జగదీష్, దేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.చిరంజీవులు, ఆర్డీ ఓ వెంకటరావు, తహశీల్దారు అప్పలరాజు, తదితరశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అన్నదాతల అవగాహనకు క్షేత్రీయ పాఠశాలలు
గజపతినగరం, నవంబర్ 22 : రబీ పైర్లు సాగుపట్ల రైతులలో అవగాహన కల్పించేందుకు రైత క్షేత్రీయ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు స్థానిక వ్యవసాయ సంచాలకులు సిహెచ్ లచ్చన్న చెప్పారు. గురువారం ఇక్కడ వ్యవసాయ సహాయ సంచాలకుని కార్యాలయంలో ఆత్మాకమిటీ సభ్యుల సమావేశం జరిగింది. రైతులు రబీలో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు ఎంపిక చేసిన గ్రామాలలో ప్రదర్శనా క్షేత్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈమేరకు ప్రణాళిక రూపొందించి జిల్లా ఉన్నతాధికారులకు అందజేసినట్లు చెప్పారు. సమావేశానికి సభ్యులు హాజరు అయ్యేవిధంగా సమాచారాన్ని తెలపాలని కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు అధికారులను కోరారు. సాగు పద్దతుల పట్ల అవగాహన కల్పించేందుక కొంత మంది రైతులను ఎంపిక చేసి హైదరాబాద్ , భువనేశ్వర్ తదితర ప్రాంతాలకు పంపిస్తున్నట్లు చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ మండల వ్యవసాయాధికారు మోపాడ ఉమామహేశ్వరనాయుడు, కె. తిరుపతిరావు, పూడి నిర్మల, కె గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సత్యసాయి వ్రతాలు
మెంటాడ, నవంబర్ 22 : స్థానిక మెంటాడ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో గురువారం నాడు శ్రీ సత్య సాయి బాబా జయంతి దినోత్సవం సంధర్భంగా సామూహిక వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సామూహిక వ్రతాలు జామి గ్రామానికి చెందిన పురోహితుడు చింతా సూరిబాబుశర్మ వేద మంత్రాలతో భక్తుతలో వ్రతాలు చేయించారు. దంపతులు భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని సత్యసాయి కమిటీ తాడ్డి అప్పారావు, వర్రి పైడిపునాయుడు తదితరులు పంపిణీ చేసారు. అలాగే భక్తులకు తీర్ధ ప్రసాదాలతో పాటు బోజన సౌకర్యం కమిటీ సభ్యులు కల్పించారు. అలాగే శుక్రవారం అన్నదాన కార్యక్రమం చేపట్టనున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం. రామోహన్ రావు, లెంక పోలినాయుడు పాల్గొన్నారు.
‘కనీస వేతనాలు చెల్లించాలి’
చీపురుపల్లి, నవంబర్ 22 : కేంద్ర ప్రభుత్వ పధకాలలోని ఉద్యోగులందరికీ కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వివి రమణ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం నిమిత్తం ఈనెల 26,27 తేదీలలో చేపట్టనున్న చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిఐటియు ఆద్వర్యంలో జీపుజాతా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పధకాల్లో ఉద్యోగులకు కనీస వేతనాలుల చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాధరాజు, అంబళ్ళ గౌరినాయుడు, శ్రీదేవి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా: ఒకరి మృతి
గరివిడి, నవంబర్ 22 : మండలంలోని గొట్నంబి గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో బూరాడ అప్పలనాయుడు (35) అనే కళాసీ దుర్మరణం చెందిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. మృతుడు అప్పలనాయుడు మెరకముడిదాం మండలం రాచపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ కళాసీ గొట్నంబి వచ్చి తిరుగు ప్రయాణలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పొలాల్లో బోల్తాపడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ ట్రాలీ క్రింద పడి ఆయన మృతిచెందాడు. మృతదేహానికి చీపురుపుల్లి ఆసుపత్రి పోస్టుమార్టుం నిర్వహించారు. ఈ కేసును గరివిడి ఎఎస్సై వెంకటజనన్నాధరావు దర్యాప్తు చేస్తున్నారు.
‘వ్యవసాయ యాంత్రీకరణకు నిధులు మంజూరు’
గజపతినగరం, నవంబర్ 22: రైతులకు వ్యవసాయంపై నమ్మకం కలిగించేందుకే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భధ్రతా పధకాన్ని ప్రవేశ పెట్టిందని స్థానిక ఎంఎల్‌ఎ బొత్స అప్పలనర్సయ్య అన్నారు. గురువారం ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటి యార్డులో ఆదర్శ రైతులు, ఎంపికైన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జిల్లాకు వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన పరికరాలు రాయితీపై సరఫరాకు 1.22 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. సబ్ డివిజన్ పరిధిలో 2500 హెక్టార్లులో అపరాల పైర్లు సాగు చేస్తున్నారన్నారు. నీలం తుఫాన్ వలన పంటలకు నష్టం కంటే లాభమే ఎక్కువగా జరిగిందన్నారు. పంట కోల్పొయిన కౌలు రైతులకు నష్ట పరిహారం అందే విధంగా అధికారులను అదేశించాన్నారు. వ్యవసాయ శాఖ జెడి లీలావతి మాట్లాడుతూ రైతులకు అవసరమైన పంట రుణాలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జాతీయ పప్పుదినుసుల అభివృద్ధి పథకం ద్వారా రబీలో సాగు చేయడానికి నూరు శాతం రాయితీపై ఎరువులు విత్తనాలు క్రిమిసంహారక మందులు పంపిణీ చేశారు.
ఏరువాక కేంద్రం శాస్తవ్రేత్త గురుమూర్తి, ఎడిఎ సిహెచ్ లచ్చన్న, ఎఎంసి అధ్యక్ష, ఉపాధ్యాక్షులు కరణం ఆదినారాయణ, ఎఒలు ఎం.ఉమామహేశ్వరనాయుడు, కె.తిరుపతిరావు, పూడినిర్మల, కె.గోవిందమ్మ, మాజీ ఎంపీపి రాపాకసూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో నిందితులు: చోరీ సొత్తు స్వాధీనం
విజయనగరం , నవంబర్ 22: పట్టణంలో వివిధ దొంగతనాలతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు టూటౌన్ సి.ఐ వెంకట అప్పారావు తెలిపారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందిన సమాచారం మేరకు బుధవారం నాడు స్థానిక రింగురోడ్డు కల్గ్భిగవాన్ గుడి వద్ద చుక్క మంగరాజు, షేక్ ఫియాజ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలతోపాటు అయిదు తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు చోరీ సొత్తులో మూడు ద్విచక్ర వాహనాలు ఒన్‌టౌన్ స్టేషన్ పరిధివికాగా మిలిగిలిన చోరీ సొత్తు టూటౌన్ స్టేషన్‌కు సంబంధించినవిగా గుర్తించామన్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందుతులను అదుపులోకి తీసుకోవడంలో చొరవచూపిన ఎస్సై కృష్ణకిశోర్, హెచ్.సి శ్రీనివాసరావు, పిసిలు సి.హెచ్ వెంకటపైడిరాజు, త్రినాథ్, డి.శంకరరావు తదితరులను ఆయన అభినందించారు.

36 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
విజయనగరం , నవంబర్ 22: ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు 36 కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎస్.వేణుగోపాలనాయుడు తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనిలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పౌరసరఫరాలశాఖ ఉప తహాశీల్దార్లు, గ్రామైక్య సంఘాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరం, బొబ్బిలి, బలిజపేట, పార్వపురం, సాలూరు, కురుపాం, గజపతినగరం, చీపురుపల్లి వ్యవసాయ మార్కెట్‌ల్లోను, భోగాపురం, విజయనగరం, గజపతినగరం, చీపురుపల్లి, ఎస్.కోట, కొత్తవలస, పార్వతీపురం, బొబ్బిలి, తెర్లాం, మక్కువ, సాలూరు, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఎం.ఎల్.ఎస్. పాయింట్ల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. గ్రేడ్ -ఎ ధాన్యానికి క్వింటాలుకు 1280 రూపాయలు, సాధారణ రకానికి 1250 రూపాయల కనీస మద్ధతు ధరను ప్రకటించిందన్నారు.

‘తప్పు చేస్తే..దానికి బాధ్యత వహిస్తా’
పార్వతీపురం, నవంబర్ 22: విధి నిర్వహణలో తప్పులు చేస్తే అందుకు తాను బాధ్యత వహిస్తానని జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ సి ఎ ఆనంద్ మణికుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఇక్కడ తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ విధి నిర్వహణలో తాను తీసుకున్న చర్యలు నచ్చని వ్యక్తులు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయసంఘాలు, విద్యార్థి సంఘాలు తనను సస్పెండ్ చేయాలని, డిస్మిస్ చేయాలని డిమాండ్ చేసి అనవరసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఏడాదిన్నరగా అదేపనిగా లేనిపోని ఆరోపణలు చేస్తూ మనస్థాపానికి గురిచేస్తున్నాయని అన్నారు. తాను విధి నిర్వహణలో ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. తాను తప్పు చేసినట్టు రుజువుచేస్తే అందుకు బాధ్యత వహిస్తానన్నారు. గిరిజన సంక్షేమశాఖలోని ఉద్యోగులు కొందరు చేసిన డ్యూటీ పరంగా చేసిన తప్పులపై తాను కఠిన చర్యలు తీసుకోవడం వల్లనే తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు హెయిర్ కటింగ్ కోసం బడ్జెట్ కేవలం రూ.3లక్షలు మంజూరైతే రూ.60లక్షల నిధులు తాను స్వాహా చేశానని తనపై తప్పుడు ఆరోపణలు గుప్పించడం దారుణమన్నారు. తప్పు చేసినట్టు సాక్ష్యాధారాలతో నిరూపించగలిగితే తనపై కేసుకూడా పెట్టుకోవచ్చునన్నారు. తాను ఎవరి బెదిరింపులకు తలొగ్గేది లేదని డిడి మణికుమార్ స్పష్టం చేశారు.
‘కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం’
లక్కవరపుకోట, నవంబర్ 22 : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి విమర్శించారు. గురువారం మండలంలోని నర్సంపేట, లచ్చంపేట కళ్లేపల్లిరేగ గ్రామాలలో పల్లె,పల్లెకూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనాధుపెదబాబా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లలితకుమారి పాల్గొని ప్రజల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలనుద్ధ్దేశించి ఆమె మాట్లాడుతూ సమాజంలో అన్ని దురాగతాలకు కాంగ్రెస్ నాయకులే కారణమని విమర్శించారు.
రేపు వికలాంగుల క్రీడా పోటీలు
విజయనగరం , నవంబర్ 22: వికలాంగుల్లో ఆత్మవిశ్వాసాని పెంపొందించే చర్యల్లో భాగంగా ఈనెల 24న వికలాంగుల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.అచ్యుతరామ రాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో పోటీలను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. పోటీలు జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరుగుతాయన్నారు. క్రికెట్, క్యారమ్స్, ఛెస్, పరుగుపందెం, షాట్‌పుట్, ట్రైసైకిల్ రేస్, జావలిన్ త్రో అంశాల్లో జరుగుతాయన్నారు. ఈపోటీల్లో గెలుపొందిన వికలాంగ క్రీడాకారులు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులన్నారు.

‘తాటిపూడి’కి పర్యాటకుల తాకిడి
గంట్యాడ, నవంబర్ 22 : పర్యాటక కేంద్రమై తాటిపూడికి గురువారం పలు ప్రాంతాల నుంచి ప్రర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం పిక్నిక్ సీజన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పలు వాహనాల్లో తాటిపూడికి చేరుకున్నారు. అక్కడి ప్రకృతి అందాలు, జలాశయం, తిలకించి ఆనందంగా గడిపారు. జలాశయం వద్ద అదనపుఆకర్షణగా ఉన్నశిర్డిసాయి విగ్రహాన్ని విద్యార్ధులు ఆశక్తితో తిలకించారు. మధ్యహ్నం వరకు ఆటపాటలతో గడిపిన పర్యాటకులు వన భోజనాలు చేశారు.

‘పాల ప్రగతి కేంద్రాల ఏర్పాటుకు రుణాలు’
బొండపల్లి, నవంబర్ 22 : పాల ప్రగతి కేంద్రాల ఏర్పాటుకు ముందుకు వచ్చే స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా రాయితీపై రుణాలు అందజేయనున్నట్లు ఇందిరా క్రాంతి పధం ప్రాంతీయ సమన్వయ కర్త కె. రాజేశ్వరి చెప్పారు. గురువారం స్థానిక ఐకెపి కార్యాలయంలో మండల స్థాయి గ్రామైక్య సంఘాల అధ్యక్షుల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాల ప్రగతి కేంద్రాల ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయగా వెనుక బడిన తరగతుల కార్పొరేషన్, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ల్ రాయితీ సమకూరుస్తుందన్నారు. తమిళనాడు నుంచి తీసుకొచ్చిన పాడి ఆవులు తొలివిడత 5, మలివిడత 3 ఆవులు సమకూర్చనున్నట్లు చెప్పారు. పశుగ్రాసం పెంచడానికి అవసరమైన భూమి అలాగే పశువులకు అవసరమైన షెడ్లు గల సంఘాలు దరఖాస్తులు గ్రామైక్య సంఘ అధ్యక్షుల ద్వారా అందజేయాలన్నారు. రాచకిండాం, కనిమెరక, లింగాలవలస, గజపతినగరం, దత్తిరాజేరు, రాచభద్రపురం, బాడంగి, మెంటాడ గ్రామాల్లో 10 పాల ప్రగతి కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదలు పంపామన్నారు.

జిల్లాకు మరో జాతీయ అవార్డు
విజయనగరం, నవంబర్ 22: జిల్లాలోని మరో ప్రభుత్వ విభాగం జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. తల్లిపాల వారోత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించినందుకు గాను స్ర్తిశిశు సంక్షేమ శాఖ ఈసారి జాతీయ పురస్కారాన్ని అందుకుంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఇటీవల నిర్వహించి కార్యక్రమంలో రాష్ట్రం నుంచి అయిదు సంస్థలను ఎంపిక చేశారు. దేశ వ్యాప్తంగా 115 ప్రతిపాదనలు అందగా, 10 సంస్థలను జాతీయ ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. ఎంపికైన వాటిలో రాష్ట్రానికి చెందినవే 5 సంస్థలున్నాయి. ఈమేరకు ప్రమోషన్ నెట్‌వర్క్ ప్రోగ్రాం అధికారి ఆర్నికా శర్మ నుంచి జిల్లా స్ర్తిశిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి ఎ.ఇ.రాబర్ట్స్‌ను అభినందిస్తూ లేఖ వచ్చింది. ఇప్పటికే ఉపాధిహామీ పథకం అమలు, సాక్షర భారత్ కార్యక్రమం నిర్వాహణ, మీసేవ కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కిన సంగతి విదితమే. ఈసందర్భంగా స్ర్తిశిశు సంక్షేల శాఖ అధికారి ఎ.ఇ.రాబర్ట్స్‌ను, సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య అభినందించారు.

బెల్ట్ షాపు మూయించాలంటూ మహిళల బైఠాయింపు
గంట్యాడ, నవంబర్ 22 : గ్రామంలోని మద్యం బెల్డు దుకాణాల విషయమై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇకనైనా స్పందించి వాటిని మూయించాలని లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మండలం తాటిపూడి గ్రామానికి చెందిన పొదుపు సంఘాల మహిళలు అధికారులను హెచ్చరించారు. 10 పొదుపు సంఘాలకు చెందిన మహిళలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన జరిపారు. తమకు న్యాయంచేయాలంటూ పోలీసుస్టేషన్ ముందు బైఠాయించారు. అనంతరం స్థానిక చర్యలు తీసుకోవాని కోరుతూ ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. దీనికి ఎస్సై స్పందిస్తూ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకు మందు మహిళలు అంతా తహశీల్ధార్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన జరిపారు. మద్యం బెల్టు షాపులు వెంటనే మూయించాలని ఈ విషయంలో తమకు సహకరించాలని కోరుతూ తహశీల్దార్ త్రినాధమ్మ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోదుపు సంఘాల మహిళలు జనాభా పరంగా తమ గ్రామం చాలా చిన్నదని అయితే 11 మద్యం బెల్టు షాపు ఉన్నాయని తెలిపారు. మద్యానికి బానిసైన తమ భర్తలు డబ్బుల కోసం పలు రకాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు షాపులను మూయించి తమ జీవితాలను కాపాడాలని ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు వినతినిచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మండల స్థాయి అధికారులను అభ్యర్ధించేందుకు ఇక్కడికి వచ్చామన్నారు. అధికారులు వెంటనే స్పందించకుంటే శుక్రవారం నుంచి గ్రామంలోని మద్యం బెల్టు షాపులను తామే బంద్ చేయించడానికి నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న
english title: 
rd pulls up engineering officials

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>