నూజివీడు, నవంబర్ 23: నోరూరించే నూజివీడు మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చాయి. సాధారణంగా జనవరిలో మామిడి కాయలు మార్కెట్లోకి వస్తాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ముందుగా పూతవచ్చింది. ఆయా ప్రాంతాలకు చెందిన కాయలు నూజివీడు మార్కెట్కు వచ్చాయి. పప్పులోకి ఉపయోగించి మామిడి కాయల రుచి చూద్దామని ఆశించిన వారికి వాటి ధర చూసి గుండె గుభేల్ మంది. ఒక్కో మామిడి కాయను వ్యాపారులు 40 నుండి 50 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. సీజన్లో తొలిగా వచ్చిన కాయల రుచి చూడాల్సిందేనంటూ పలువురు బేరమాడి మరీ మామిడి కాయలు కొంటున్నారు.
* కాయ 50రూపాయలే!
english title:
nuzvid mamidi
Date:
Saturday, November 24, 2012