Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

బంగాళా దుంప, శనగపప్పు కూర

$
0
0

కావలసినవి
బంగాళా దుంపలు - 250 గ్రా.
శనగపప్పు - 100 గ్రా.
ఉల్లిపాయ - 1
టమాటాలు -2
అల్లం వెల్లుల్లి - 1 టీ.స్పూ.
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 1/2 టీ.స్పూ.
గరం మాసాలా పొడి- 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.

తయారు చేసేదిలా
శనగపప్పును కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి. బంగాళా దుంపలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి రెండు నిమిషాలు వేయించి నానబెట్టిన శనగపప్పును వేయాలి. పప్పు తడి మొత్తం పోయేవరకు వేయించి బంగాళా దుంప ముక్కలు, కారం పొడి, తగినంత ఉప్పువేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. శనగపప్పు, బంగాళా దుంపల ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత గరం మసాలా కలిపి దింపేయాలి. ఈ కూర అన్నం, చపాతీలకు బావుంటుంది.

శనగపప్పును కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి
english title: 
potato

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles