కావలసినవి
మటన్ - 250గ్రా.
ఉల్లిపాయలు - 2
పసుపు - 1/4 టీ.స్పూ.
కారం పొడి - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 2 రెబ్బలు
ఎండుమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం వెల్లుల్లి ముద్ద
- 1 1/2 టీ.స్పూ.
కొబ్బరి పొడి - 3 టీ.స్పూ.
జీడిపప్పు- 10
బాదం పప్పు- 10
లవంగాలు- 6
యాలకులు - 4
దాల్చిన చెక్క - చిన్న ముక్క
షాజీర - 1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 3 టీ.స్పూ.
వండేవిధం
కొబ్బరిపొడి, జీడిపప్పు, బాదం పప్పు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా విడిగా నూరి పెట్టుకోవాలి. పాన్‌లో రెండుచెంచాల నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్దవేసి దోరగా వేయించాలి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, షాజీరా వేసి కొద్దిగా వేసి, శుభ్రం చేసుకున్న మాంసం ముక్కలు అందులో కలిపి మూతపెట్టాలి. మాంసం ముక్కలు బాగా వేగిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసి పలుచగా చేసి ఉడకనివ్వాలి.
మాంసం ముక్కలు మసాలాలలో బాగా ఉడికి నూనె తేలిన తర్వాత దింపేయాలి. మరో చిన్న గినె్నలో చెంచాడు నూనె వేడి చేసి ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా మాంసంలో కలపాలి. ఈ కూర పులావ్, బిర్యానీ, రోటీ నాన్‌లకు చాలా బావుంటుంది.