కావలసినవి
చికెన్ కీమా - 250 గ్రా.
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి ముద్ద - 2 టీ.స్పూ.
సోయా సాస్ - 1 టీ.స్పూ.
పచ్చిమిర్చి - 3 -4
గుడ్డు - 1
కార్న్‌ఫ్లోర్ - 2 టీ.స్పూ.
మిరియాల పొడి - 1 టీ.స్పూ.
అజినొమొటో - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
బ్రెడ్ స్లైసులు - 8 - 10
నూనె - వేయించడానికి
ఇలా చేయాలి
చికెన్ కీమాలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, కార్న్‌ఫ్లోర్, మిరియాల పొడి, అజినొమొటో, ఉప్పు, సోయా సాస్, గుడ్డు వేసి మిక్సీలో తిప్పాలి. తర్వాత ఈ మిశ్రమం ఒక గినె్నలో తీసుకుని చిన్న ఉండలు చేసుకోవాలి. బ్రెడ్ స్లైసులను ఏదైనా మూత లేదా గినె్నతో గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. కీమా ఉండలను వెడల్పుగా చేసి బ్రెడ్ స్లైసుమీద పలుచగా పరిచి మెల్లగా ఒత్తి పెట్టాలి. ఇలా అన్నీ చేసుకుని ఫ్రిజ్‌లో 15 నిమిషాలు ఉండాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ స్లైసులను కీమా ఉన్న వైపు ముందుగా నూనెలో జారవిడిచి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తిప్పాలి. రెండోవైపు కూడా బంగారు రంగు వచ్చాక తీసేయాలి. ఈ గోల్డ్ కాయిన్స్‌ని టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.