కావలసినవి
బెండకాయలు ..... 250 గ్రా.
ఉల్లిపాయలు ......... 2
కరివేపాకు ......... 3 రెబ్బలు
శనగపిండి ....... 1 కప్పు
పసుపు ............. 1/4 టీ.స్పూ.
కారం పొడి ....... 1 1/2 టీ.స్పూ.
ధనియాల పొడి ....... 1 టీ.స్పూ.
వాము ..... 1 టీ.స్పూ.
ఉప్పు .......... తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద ...... 1టీ.స్పూ.
నూనె .... వేయించడానికి
వండండి ఇలా
బెండకాయల రెండు వైపులా అంచులు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గినె్నలో శనగపిండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం పొడి, ధనియాల పొడి, వాము, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇందులో బెండకాయ ముక్కలు వేసి నీరు చల్లుకుంటూ పొడి పొడిగా కలపాలి. బాణలిలో నూనె వేడి చేసి ఈ మిశ్రమాన్ని చేత్తో చిన్న ముక్కలుగా పొడి పొడిగా వేసి అన్ని వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేపాలి. చివరలో కొన్ని కరివేపాకులు కరకరలాడేలా వేయించుకుని పకోడీలలో కలుపుకోవాలి. ఇవి వేడిగానే తింటే కరకరలాడుతూ ఉంటాయి. చల్లారితే బాగోదు.