కావలసినవి
కొబ్బరి తురుము ......... 1 కప్పు
ఖర్జూరం తురుము ..... 1/2 కప్పు
యాలకుల పొడి ....... 1 టీ.స్పూ.
జీడిపప్పు ..... 10
బాదం పప్పు - 10
కిస్‌మిస్ - 20
నెయ్యి - 3 టీ.స్పూ.
వండే విధం
ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి సన్నగా పొడిలా చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేడి చేసి కొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి. ఇందులో ఖర్జూరం పొడి వేసి కలుపుతూ నిదానంగా ఉడికించాలి. మి శ్రమం మొత్తం ఉడికి దగ్గర పడి ఉండగా మారుతున్నప్పుడు యా లకులపొడి, కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం, కిస్‌మిస్ వేసి మరో రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చేసుకుని ఆరనివ్వాలి. పిల్లలకు మంచి బలవర్థకమైన ఆహారం ఇది.
ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి సన్నగా పొడిలా చేసుకోవాలి.
english title:
kobbari, karjuram laddulu
Date:
Sunday, November 25, 2012