కావలసినవి
చేమ దుంపలు ......... 250 గ్రా.
ఉల్లిపాయలు ........... 2
పచ్చిమిర్చి .............. 2
కరివేపాకు ............. 1 రెబ్బ
కొబ్బరి పొడి .......... 3 టీ.స్పూ.
ధనియాల పొడి ........ 1 టీ.స్పూ.
గసగసాల పొడి ........ 1 టీ.స్పూ.
నువ్వుల పొడి ....... 1 టీ.స్పూ.
పెరుగు .............. 1/2 కప్పు
గరం మసాలాపొడి ... 1/4 టీ.స్పూ.
కారం పొడి .......... 1 టీ.స్పూ.
పసుపు ......... 1/4టీ.స్పూ.
నూనె ................... 3 టీ.స్పూ.
వండే విధం
చేమదుంపలను చెక్కు తీసి చిన్న చక్రాలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ సన్నగా తరిగి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. పెరుగులో కొబ్బరి పొడి, నువ్వుల పొడి, గసగసాల పొడి, కారం పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్ద వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. తర్వాత చేమదుంప ముక్కలు, కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పసుపు వేసి దోరగా వేయించాలి. ముక్కలు వేగి సగం ఉడికినట్టు అయ్యాక కలిపి ఉంచుకున్న పెరుగు, మసాలా ముద్ద వేసి కలపాలి. అరకప్పు నీళ్లు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికి నూనె తేలుతున్నప్పుడు కిందకు దింపేయాలి.