కావలసినవి
బియ్యం పిండి - 2 కప్పులు
పాలకూర తరుగు - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 3
జీలకర్ర - 1 టీ.స్పూ.
నువ్వులు - 1 టీ.స్పూ.
శనగపప్పు - 2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
అల్లం వెల్లుల్లి ముద్ద - 1/2 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - 1/4 కప్పు
తయారు చేసేదిలా
కప్పుడు నీళ్లలో శనగపప్పును నానబెట్టాలి. రెండు కప్పుల నీరు మరిగించి పాలకూర ఆకులు వేయాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గినె్నలో బియ్యం పిండి తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, నువ్వులు, తగినంత ఉప్పువేసి కలపాలి. ఇందులో పాలకూర ముద్ద, నానబెట్టిన శనగపప్పు వేసి, బాగా కలిపి తగినన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీ ముద్దలా కలిపి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత ఆ పిండిని మర్థనా చేసి కొంచెం నిమ్మకాయంత సైజు ముద్దలు చేసుకోవాలి. పెనం మీద ఈ ముద్ద పెట్టి నూనె అద్దుకున్న చేతితో వెడల్పుగా వత్తాలి. మధ్య మధ్య వేలితో రంధ్రాలు చేయాలి. ఈ పెనం పొయ్యిపై పెట్టి వేడి చేస్తూ చుట్టూ, మధ్యలో చేసిన రంధ్రాలలో కొద్దిగా నూనె వేసి మూత పెట్టి ఉంచాలి. ఆ వేడికి రొట్టె రెండు వైపులా ఉడికి కాలిన తర్వాత తీసేయాలి. ఇలా అన్నీ చేసుకోవాలి.