కావలసినవి
ధోక్లా ....... 250 గ్రా.
క్యారట్ తురుము ..... 1/4 కప్పు
ఉల్లిపాయ ............. 1 చిన్నది
పచ్చిమిర్చి ....... 3
అల్లం .................. చిన్న ముక్క
కరివేపాకు ........... 2 రెమ్మలు
కొత్తిమీర ............. కొద్దిగా
ఆవాలు, జీలకర్ర ..... 1/4 టీ.స్పూ.
ఉప్పు .................. తగినంత
నిమ్మరసం ...... 1/4 టీ.స్పూ.
నూనె ............. 3 టీ.స్పూ.
ఇలా చేద్దాం
ఎప్పుడైనా ధోక్లాలు మిగిలిపోతే పారేయకుండా నిమిషాల్లో ఇలా ఉప్మాలా చేసుకోవచ్చు. ముందుగా ధోక్లాలను పొడి పొడిగా చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి, చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో కరివేపాకు, కారట్ తురుము వేసి కలపాలి. తర్వాత ధోక్ల్లా పొడి వేసి కలిపి ఉప్పు సరిచూసుకోవాలి. ఎందుకంటే ధోక్లాలో ముందే ఉప్పు వేసుకుంటాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా వేపిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత దింపేయాలి. ఇడ్లీలు మిగిలిపోయినా ఇలాగే చేసుకోవచ్చు.