రామగిరి, జనవరి 27: వస్త్రాలపై విధించిన 5శాతం వ్యాట్ పన్నును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారులు శుక్రవారం సాయంత్రం కొవ్తత్తులతో ర్యాలీ చేబట్టి పట్టణంలోని వీధులలో తిరుగుతూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పన్నును రద్దు చేసి వస్త్ర వ్యాపారులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌పిటి మార్కెట్ అధ్యక్షుడు కోట నర్సింహ్మ కార్యదర్శి గట్టు రాజేందర్, కోశాధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఫిబ్రవరి 2న చౌటుప్పల్‌లో మహిళా కాంగ్రెస్ బహిరంగ సభ
రామగిరి, జనవరి 27: జిల్లాలో కాంగ్రెస్‌పార్టీ పటిష్టపరిచి రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు మహిళా కాంగ్రెస్ కృషి చేస్తుందని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముంగి చంద్రకళ తెలిపారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 2న చౌటుప్పల్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అథిదులుగా జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనితావర్మ, రాష్ట్ర అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా ఇంచార్జీ మంత్రి సునితాలక్ష్మారెడ్డి, పంచాయితీరాజ్ శాఖా మంత్రి జానారెడ్డి, కౌన్సిల్ డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ లతో పాటు జిల్లాకు చెందిన ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సభకు జిల్లాలోని మహిళా కాంగ్రెస్ మండల, బ్లాక్, నియోజకవర్గ, కార్యవర్గ కమిటీ నాయకులు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశానికి ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి కి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి గటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు జాలపు వనజారెడ్డి, దొంతటి పూలమ్మ, సిహెచ్ సంధ్యారాణి, వి.జ్యోతి, పి.ఝాన్సీ, నిమ్మల భారతమ్మ, జె.సుచరిత, కె.శ్రీలక్ష్మీ, కె.అండాలు, పి.దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.