రామగిరి, జనవరి 27: తెలంగాణపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ విధానాలు నిరసిస్తూ భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు జి.కిషన్‌రెడ్డి చేపట్టిన బిజెపి తెలంగాణ పోరుయాత్ర పర్యటనను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్ కోరారు. బిజెపి నల్లగొండ అసెంబ్లీ కన్వినర్ బండారు ప్రసాద్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక బండారు గార్డెన్స్‌లో జరిగిన నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅథిదిగా హాజరై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టస్రాథన జాతీయపార్టీ అయిన బిజెపి ద్వారా మాత్రమే సాధ్యమని ఆ దిశగా బిజెపి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే విధంగా కృషి చేస్తున్నదన్నారు.
ఆలేరులో ప్రారంభమయ్యే యాత్రకు నల్లగొండ అసెంబ్లీ నుండి 50వాహనాలలో కార్యకర్తలు తరళివెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఓరుగంటి రాములు, పల్లెబోయిన శ్యాంసుందర్, బాకి పాపయ్య, పోతెపాక సాంబయ్య, దర్శన వేణుకుమార్, బొజ్జ శేఖర్, చింతల సుజాత, పిండి పాపిరెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి, తిరందాసు సంతోష్‌కుమార్, పోతెపాక లింగస్వామి, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 18 సభలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల 4వ తేదీన ఆలేరు లో కిషన్‌రెడ్డి చేపట్టే యాత్రకు జిల్లా బిజెపి తరుపున భారీ స్వాగతం పలుకనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బండారు గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4వ తేదీన ఆలేరు, 5వ తేదీన మునుగోడు, దేవరకొండ, 6వ తేదీన నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలలో 18 సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలేరు లో పంట నష్టపోయిన రైతుల తోను, మర్రిగూడలో ఫ్లోరైడ్ భాదితుల తోను, చౌటుప్పల్ లో గీతకార్మిలకుల తోను, దేవరకొండలో శిషు విక్రయాలకు పాల్పడిన వారితోను ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకోనున్నట్లు తెలిపారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు వీరెళ్లి చంద్రశేఖర్
english title:
poru yathra
Date:
Saturday, January 28, 2012