భువనగిరి, జనవరి 27: రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సంస్కరణలు, ఆధునికరణకై 90కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దంచేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని జైళ్ల శాఖ డిజి డాక్టర్ సిఎన్ గోపినాధ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని రాయిగిరి గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతు 13వ ఆర్థిక సంఘం నిధుల క్రింద 90కోట్ల రూపాయల ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడంతో ప్రస్తుతం 2.25లక్షలు కేంద్ర ప్రభుత్వం మంజూరి చేసిందన్నారు. ఈ నిధులతో శిధిలావస్థకు చేరిన జైళ్లలో నూతన భవనాలతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఖైధిలకు మొదటి సారిగా టెలిఫోన్ కనెక్టివిటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ సౌకర్యం క్రింద ప్రతి ఖైధి నెలకు 8సార్లు ఐదు నిమిషాలసేపుతమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. అదే విధంగా ఖైధిలలో సత్‌ప్రవర్తన పెంపొందించడం కోసం యోగా, ద్యానం, కౌన్సిలింగ్, వివిధ మత భోదకులచే ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జైళ్లలో సుమారు 16వేల మంది ఖైదిలు ఉన్నారని వీరికి ఉపాధి కల్పించడంలో భాగంగా బేకరి యూనిట్స్, ఇతర ఫర్నిచర్ వంటి పనులు చూపెట్టడం జరిగిందన్నారు. కడపలో ఖైదిలచే ప్రారంభించిన పెట్రోల్ బంక్ ద్వారా నెలకు 1.85లక్షల ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. త్వరలో మరో 11బంకుల ద్వారా ఖైదిలకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. జైళ్ల శాఖలో సిబ్బంది కొరత నివారణలో భాగంగా ప్రస్తుతం 6వందల మంది సిబ్బంది శిక్షణ పొందుతున్నారని, త్వరలో 7వందల మందిని భర్తి చేస్తామని ఆయన అన్నారు. జైళ్లలో ఖైదిలకు ఏయిడ్స్ వ్యాధి అధికంగా సోకుతుందని ఎపి సాక్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఖైదిల వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
జైళ్ల శాఖ డిజి డాక్టర్ సిఎన్ గోపినాధ్‌రెడ్డి
english title:
gopinatha reddy
Date:
Saturday, January 28, 2012