నల్లగొండ , జనవరి 27: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలమేరకు జిల్లాలో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఈనెల 19నుంచి మూడురోజులు ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సిలింగ్ నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం పదోన్నతులపై స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడంతోపాటు 1996 డిఎస్సీలో నియమాకం జరిగిన వారిని పదోన్నతుల జాబితాలో చేర్చాకపోవడంతో వారిని పదోన్నతులకు అనుమతించాలని నిరసనలు తెల్పడంతో డిఇవో ఆ విభాగం పదోన్నతుల కౌన్సిలింగ్‌ను నిల్పివేడంతో ఉపాధ్యాయులలో అనిశ్చితి నెలకొంది. కాగా జిల్లా లో వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 32 జీవశాస్త్రం సూల్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్‌జిటీ ఉపాధ్యాయులు గాపనిచేస్తున్న వారిని 1:3నిష్పత్తి ప్రకారం కౌన్సిలింగ్‌కు తొలిరోజు పిలిచారు. తొలిరోజు నుంచి 3రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించకపోవడంతో వారు కౌన్సిలింగ్ కేంద్రం వద్ధ నిరీక్షించి వెనుతిరిరగారు. దీనితో డిఇవో పి.మదన్‌మోహన్ జీవశాస్త్రం పదోన్నతులపై స్పష్టమైన ఆదేశాలు అందించాలని జీల్లాలలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర విద్యాశాఖకు నివేదికలను పింపించారు. పదోన్నతుల కౌన్సిలింగ్ ముగిసి 6రోజులు గడుస్తున్నప్పటికి రాష్ట్ర విద్యాశాఖ నుంచి స్పష్టమై ఆదేశాలు అందకపొవడంపై తమ సీనియార్టీ ని కొల్పొతున్నమని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
* రాష్ట్ర విద్యాశాఖ డైక్టరేట్ నుండి అందని ఉత్తర్వులు * ఆందోళనలో జీవశాస్త్రం ఉపాధ్యాయులు
english title:
jeeva shastram
Date:
Saturday, January 28, 2012