Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కార్తీకం.. భక్తజన సంద్రం

$
0
0

ఏర్పేడు, నవంబర్ 28: పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం భక్తజనం సంద్రమైంది. శివ, కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా సుదూర ప్రాంతాల నుంచి వాయులింగేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది సంఖ్యల్లో భక్తులు తరలి వచ్చారు. బ్రహ్మోత్సవాలను తలపించే రీతిగా స్వామి, అమ్మవార్లరను దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. అయ్యప్ప దీక్షలోని భక్తులు, సాధారణ భక్తులతో ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయ ఆవరణ శివనామస్మరణతో మార్మోగిపోయింది. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 55వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు టెండర్ల జోరు
* సమర్థవంతంగా పనులు పూర్తి చేసి సిఎం వద్ద మార్కులు కొట్టేసేందుకు అధికారుల మధ్య పోటీ
తిరుపతి, నవంబర్ 28: ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. ఈనెల 30వ తేదీ లోగా టెండర్ల పక్రియను పూర్తి చేసి డిసెంబర్ 1 నుండి 15వ తేదిలోగా పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూస్ అధికారులను ఆదేశించిన నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు ఉరుకులు, పరుగుల మీద పనులు చేపడుతున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సిఎం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు అధికారులు పోటీపడుతున్నారు. ఇప్పటికే మహాసభల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా వున్న టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, తుడా విసి పెంచల్‌రెడ్డిలు తమ సిబ్బందిని మహాసభల ఏర్పాట్లపై నిమగ్నం చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా బుధవారం టిటిడి మహతి ఆడిటోరియంలో పనులకు సంబంధించి టెండర్ల పక్రియను చేపట్టారు. 44 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలుగు మహాసభల నిర్వహణకోసం కేటాయించిన విషయం విదితమే. ఈ పనుల్లో ఆర్ అండ్ బి, తుడా, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా టెండర్ల పక్రియను ప్రారంభించారు. నేరుగా పనులను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు టెండర్ల పక్రియల్లో పాల్గొంటున్నారు. మహిళా సంఘాలు సైతం తమకు కాంట్రాక్టు పనులు ఇవ్వాలని కోరుతూ టెండర్ల పక్రియలో పాల్గొంటున్నాయి. తెలుగు మహాసభలకోసం ప్రత్యేకంగా మహతిలో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ఈ టెండర్ల పక్రియను ప్రారంభించారు. మూడు విభాగాలుగా పనులను విభజించి టెండర్ల పక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి పనులకు సంబంధించి 18 టెండర్లను ప్రకటించారు. ఇందులో 8 టెండర్లకు బుధవారం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఓపెన్ టెండర్ల పక్రియలో బాక్స్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కాంట్రాక్టర్ అయితే తక్కువ కోడ్ చేస్తూ పనులను అడుగుతారో వారికే పనులు కేటాయించనున్నట్లు అధికారులు చెపుతున్నారు. 18 పనుల్లో సంగీత, సాహిత్య సభల నిర్వహణకు 4 టెండర్లు, చలనచిత్ర ప్రదర్శన, భోజన ఏర్పాట్లకోసం 8 టెండర్లు, సభల వేదిక నిర్మాణాల కోసం 6 టెండర్లను ఆహ్వానించారు. ఇదికాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయలతో 52 పనులకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకాధికారిగా వున్న జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ ఆమోదం తెలిపారు. ఇందుకు సంబంధించి పలు పనులకు ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు టెండర్లను ఆహ్వానించిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు ఆగమేఘాల మీద టెండర్ల పక్రియ పూర్తిచేసి విమర్శలు లేకుండా అందరికన్నా ముందుగా పనులను పూర్తి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అంతేకాకుండా సమర్థవంతంగా పనులను చేపట్టి సిఎం వద్ద మార్కులు కొట్టేసేందుకు వివిధ శాఖల అధికారులు పోటీ పడుతున్న నేపధ్యంలో పనుల్లో కూడా నాణ్యత ఉండాలని అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు మంచి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి పనులను అప్పగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ పనులకు తెలుగు సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితాప్రసాద్, తుడా విసి పెంచల్‌రెడ్డిల స్వీయ పర్యవేక్షణలో టెండర్ల పక్రియ కొనసాగుతూ వుంది.

డబ్బు కోసం బాలుడి హత్య
తిరుపతి, నవంబర్ 28: డబ్బు కోసం రాక్షసత్వానికి పాల్పడ్డారు ఇద్దరు కసాయిలు. సొంత మేనమామే తమ బిడ్డను హత్య చేయడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకున్నారు. ఈనెల 11న ఎంఆర్‌పల్లికి చెందిన రమేష్ ఏకైక కుమారుడు రవితేజ (11)ను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న మేనమామ తిరుపతిరావు (28) డబ్బుకోసం కిడ్నాప్ చేశాడు. తనకు తోడుగా నరేష్ (26)ను ఎంచుకున్నాడు. ఒక పథకం ప్రకారం ఇంటిని అద్దెకు తీసుకుని ఎవరినైనా చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటుండగా, ఎదురుగా వస్తున్న మేనల్లుడ్నే వారు ఎంచుకున్నారు. బంధువు కావడంతో ఎవరికీ అనుమానం రాదని భావించిన ఆ కసాయిలు చాక్లెట్లు ఇస్తామని తమ గదికి తీసుకువెళ్లి ఆ బిడ్డ కాళ్లుచేతులు వైర్‌తో కట్టేశారు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నామో తెలియని దుస్సాసానికి తిరుపతిరావు తెగబడ్డాడు. తనను ఏదో చేస్తున్నారని భావించిన రవితేజ గట్టిగా అరవడంతో ఎక్కడ తమ బండారం బయట పడుతుందోనన్న భయంతో ఆ గదిలో ఉన్న రాడ్‌తో ఆ చిన్నారి తలపై బాదాడు. దీంతో కిడ్నాపైన గంటలోపే రవితేజను మృత్యువు కబళించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఎంఆర్‌పల్లికి సమీపంలోని ఉప్పరపల్లిలోని ముళ్లకంచెల్లో పడేశారు. రవితేజ తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐదు రోజుల తరువాత ముళ్లకంచెల్లో ఉన్న చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఎంఆర్‌పల్లి సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విఆర్‌ఓ మురళి ఇచ్చిన సమాచారంతో ఈ కేసును ఛేదించారు. బుధవారం విలేఖరులకు చూపిస్తున్న తిరుపతిరావును చంపేయ్యాలని, లేదా తనను చంపాలని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇలాంటి రాక్షసుడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదంటూ అతని భార్య ఉమామహేశ్వరి పోలీస్ స్టేషన్‌కు రావడం గమనార్హం.

పెద్దిరెడ్డి రాజీనామాకు సిద్ధం
* నేటి ఉదయం 10.30 గంటలకని ప్రచారం
* బుజ్జగింపుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం - ససేమిరా అంటున్న పెద్దిరెడ్డి
* ఇది ముందస్తు వ్యూహమంటున్న కిరణ్ వర్గం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 28: పుంగనూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామాకు మూహూర్తం ఖరారైందా? అవునంటున్నారు ఆయన వర్గీయులు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఆయన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దల్ని రంగంలోకి దింపింది. ఇటు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, అటు మాజీ పిపిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆయనను బుజ్జగించే పనిలో పడ్డట్లు ప్రచారం సాగుతోంది. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించకపోతే ఎవరెన్ని చెప్పినా తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. ఈ వ్యవహారంతో చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే తగులుతుందని పెద్దిరెడ్డి వర్గీయులు అంటుండగా, అంత సీన్‌లేదని నిందలేనిదే బొందిపోదన్న చందాన ఇప్పటికే తన కుమారుడు మిథున్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సిపిలో కీలకపాత్ర పోషిస్తున్న నేపధ్యంలో ఆయనను రాజకీయంగా పెంచడం కోసం పెద్దిరెడ్డి వేసుకున్న ముందస్తు వ్యూహమేనని కిరణ్ వర్గీయులు అంటున్నారు. పెద్దిరెడ్డి వెళ్లినంతమాత్రాన పార్టీకి జరిగే నష్టమేమి లేదని వారు తేలిగ్గా చెప్పేస్తున్నారు. తమ సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పాదయాత్రలో వున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తన అనుచరులతో తెలుసుకుంటూ వ్యూహ రచనలు చేసుకుంటున్నారు. ఇక వైఎస్‌ఆర్‌సిపి నేతలు చిత్తూరు జిల్లాలో ఇక తమ హవా కొనసాగుతుందని తెగ సంబరపడిపోతున్నారు. ఇదిలా వుండగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా పార్టీని మాత్రం వీడనని పెద్దిరెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ కార్యకర్తల్లో, ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో కొంత ఆశలు రేపుతోంది.

రూరల్ ఐటి పాలసీ అమలు చేయాలి
* యువపథం రాష్ట్ర కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
చిత్తూరు, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు రూరల్ ఐటి పాలసీ అమలు చేయాలని యువపథం రాష్ట్ర కన్వీనర్ పాలెం శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువకులను చైతన్యవంతుల్ని చేసేందుకు టిఎస్‌ఎన్‌యు రాష్ట్ర అధ్యక్షులు పాలెం శ్రీకాంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువపథం కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం చిత్తూరులోని వివేకానంద కళాశాల ఆవరణంలో జరిగింది. వివిధ కాలేజీల నుండి వచ్చిన వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐటి పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే 75వేల కోట్ల రూపాయల్లో 5శాతం గ్రామీణ ప్రాంత యువత అభివృద్ధికి ఖర్చుపెట్టాలన్నారు. గత పదేళ్లల్లో పన్నుల ద్వారా సుంపాదించిన రెండు వేల కోట్లు, సెజ్‌ల ద్వారా 60వేల కోట్ల రూపాయలు వచ్చిందన్నారు. 40శాతం సెజ్ భూముల ద్వారా వచ్చిన 70వేల కోట్లు పరిశ్రమల యజమానుల చేతుల్లో ఉందని దానిలో 10శాతం రూరల్ ఐటి పాలసీకి అందజేయాలన్నారు. అప్పుడే గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. టిఎస్‌ఎన్‌వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా దొరస్వామినాయుడు, సాప్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యంలు, యుపథం జిల్లా కన్వీనర్ ఉప్పలపాటి శ్రీనివాసచౌదరి, సాప్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యన్.రాజారెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువపథం నాయకులు ఎస్.శ్రీనివాసరెడ్డి, పఠాన్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

మా కుటుంబానికి స్వామి ద్రోహం చేతకాదు
సిఎం సోదరుడు కిశోర్‌కుమార్‌రెడ్డి స్పష్టం
పుంగనూరు రూరల్, నవంబర్ 28: రాజకీయంగా ఎదగడానికి ఎంతో దోహద పడిన కాంగ్రెస్ లాంటి పార్టీకి ద్రోహం చేసే కుటుంబం మాది కాదని, ఒకే కుటుంబంలో రెండు తండ్రి ఒక పార్టీ, తనయుడు మరొక పార్టీలో ఉంటూ తమ కుటుంబంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పరోక్షంగా పుంగనూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై డిసిసి ఉపాధ్యక్షుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నవంబర్ 30వతేది లోపు ముఖ్యమంత్రిని మార్చక పోతే తాను రాజీనామా చేస్తానని పెద్దిరెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల గడువు ఉందనగా సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు, డిసిసి ఉపాధ్యక్షుడు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పుంగనూరుకు బుధవారం పట్టణంలోని ఓప్రైవేటు పెట్రోల్ బంకులో విలేఖర్ల సమావేశం నిర్వహించడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తమ కుటుంబం మొత్తం కాంగ్రెప్‌లోనే ఉందన్నారు. వాళ్ల లాగా తండ్రి కాంగ్రెస్, కొడుకు వైఎస్‌ఆర్‌సిపిలో లేరని, అలాంటి వాళ్లు ఆదరణ ఇచ్చిన పార్టీని బెదిరించడం శోచనీయమన్నారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం, ముఖ్యమంత్రి అడ్డుకుంటున్నారనడంలో అర్ధం లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నియోజకవర్గానికి ద్రోహం చేయడం నల్లారి ఇంటావంటా లేదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సిఎం అయిన తరువాత జిల్లా అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తెలుసన్నారు. ఈ సమావేశంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష, వాల్మీకిపురం ఎఎంసి చైర్మన్ నిరంజన్‌కుమార్‌రెడ్డి, రవిచంద్రారెడ్డి, రంజిత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

‘మోహన్‌బాబుకు త్వరలో పద్మశ్రీ వీడిపోతుంది’
రేణిగుంట, నవంబర్ 28: సినీనటుడు మోహన్‌బాబుకు త్వరలోనే పద్మశ్రీ వీడిపోనుందని తెలంగాణ యునైటెడ్ ప్రంట్ సెక్రటరీ, ఎంఎల్‌సి దిలీప్‌కుమార్ వెల్లడించారు. ఆయన రేణిగుంట విమానాశ్రయంలో బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ మోహన్‌బాబుకు పద్మశ్రీ విత్‌డ్రా చేయాలని రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం సమర్పించామన్నారు. అతని పద్మశ్రీని ప్రకటనలకు, సినిమాలకు వాడుకుంటున్నారే తప్ప సమాజహితానికి వినియోగించడం లేదన్నారు.

రైతుల నుండే టిటిడి పాలు కొనుగోలు చేయాలి
* సిఎం నిర్ణయంపై రైతుల్లో ఆనందం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 28: పాడిరైతుల నుండే ఇకపై టిటిడి తప్పనిసరిగా పాలు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పాడిరైతుల్లో ఎనలేని ఆనందం వ్యక్తం అవుతోంది. టిటిడికి అవసరమైన పాలను, నెయ్యిని టిటిడి కొంత మేరకు ఎస్వీ డెయిరీ నుండి సేకరిస్తోంది. అయితే టిటిడికి అందుబాటులో వున్న పాలకన్నా అవసరమైన వేలలీటర్ల పాలను ఇతర ప్రాంతాల నుండి కొనుగోలు చేస్తోంది. ఇక నెయ్యిని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రాజకీయ బలం, అండబలం, ఆర్థిక బలం వున్న వ్యాపారులకు కాంట్రాక్టు ఇచ్చి టిటిడి కొనుగోలు చేస్తోంది. ఇకపై పాల ఉత్పత్తుల కొనుగోళ్లను రైతుల నుండే చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి రైతుల అభిమానం పెరిగే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా రోజుకు 14 లక్షల లీటర్ల పాలదిగుబడి వుంది. అయితే పాల సేకరణను ప్రభుత్వం నిలిపివేయడంతో గత రెండురోజుల క్రితం మదనపల్లిలో రైతులు పాలను నేలపాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో మంత్రి విశ్వరూప్‌తో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

కోటి బిల్వార్చనకు రూ. 60,500 వితరణ
ఏర్పేడు, నవంబర్ 28: కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న కోటి బిల్వార్చన, కుంకుమ పూజలకు గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివరావు 60,500 రూపాయలను బుధవారం ఆలయ ఇఓ శ్రీరామచంద్రమూర్తికి అందజేశారు. ఈ సందర్భంగా ఇఓ స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించి తీర్థ, ప్రసాదాలతో పాటు స్వామి, అమ్మవార్ల జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

ముక్కంటి సేవలో తితిదే చైర్మన్ సతీమణి
ఏర్పేడు, నవంబర్ 28: తితిదే చైర్మన్ బాపిరాజు సతీమణి అన్నపూర్ణమ్మ బుధవారం కార్తీక పున్నమి సందర్భంగా సర్వేశ్వరుని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఇఓ శ్రీరామచంద్రమూర్తి ఘన స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తీర్థ,ప్రసాదాలతో పాటు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మనగుడి సారె పంపిణీ
ఏర్పేడు, నవంబర్ 28: తితిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నప మనగుడి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తీశ్వరాలయం ఇఓ శ్రీరామచంద్రమూర్తి బుధవారం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయాలకు తితిదే సారెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుబంధ ఆలయాల్లోనూ, అన్ని గ్రామీణ ప్రాంతాల్లో వెలసిన ఆలయాల్లో మనగుడి నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన కంకణాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలను సారెగా అన్ని పంచాయతీల్లోని ఆలయాలకు అందజేసినట్లు వివరించారు.

కార్తీక దీపం పూజల్లో రోజా
ఏర్పేడు, నవంబర్ 28: వైకాపా నాయకురాలు, సినీనటి రోజా బుధవారం ముక్కంటి సన్నిధిలో కార్తీక దీపం వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు, వైకాపా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల తీర్థ, ప్రసాదాలతో పాటు జ్ఞాపికను ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నార

పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయం కార్తీక పౌర్ణమిని
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>