కావలసినవి
ఉడికించిన చికెన్- 1 కప్పు
చికెన్ ఉడికించిన నీళ్లు-
4 కప్పులు
అల్లం తరుగు- 1టీ.స్పూన్
వెల్లుల్లి తరుగు-
1 టీ.స్పూన్
కొత్తిమీర - 1 టీస్పూన్
ఉల్లి తరుగు- 2 టీస్పూన్
సోయా సాస్-
1 టేబుల్ స్పూన్
ఆరెంజ్ రెడ్ కలర్- చిటికెడు
కార్న్‌ఫ్లోర్ -
2 టేబులు స్పూన్లు
అజినొమొటొ- చిటికెడు
వెనిగర్- 1/2 టీస్పూన్
మిరియాల పొడి-
1/2 టీస్పూన్
పచ్చిమిర్చి- 1
ఉప్పు- తగినంత
వెన్న లేదా నూనె-
2 టీస్పూన్లు
తయారు చేసేదిలా
ఒక గినె్నలో అరకప్పు నీళ్లు, సోయా సాస్, కార్న్‌ఫ్లోర్, వెనిగర్, అజినొమొటొ, మిరియాల పొడి, ఉప్పు, కలర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాన్‌లో నూనె లేదా వెన్న వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ లేదా ఉల్లిపొరక, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి కొద్దిగా వేపాలి. ఇందులో ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత చికెన్ ఉడికించిన నీళ్లుపోసి మరిగించాలి. రెండు నిమిషాలు మరిగిన తర్వాత కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. సూప్ రెండు నిమిషాలు మరిగి చిక్కబడుతుండగా దింపేయాలి. ఈ సూప్‌లో ఇష్టముంటే సన్నగా తరిగిన క్యారట్, కాప్సికం, మష్‌రూమ్స్ కూడా వేసుకోవచ్చు.