కావలసినవి
మైదా ..................................... 2 కప్పులు
గోధుమ పిండి ...................... 1 కప్పు
పుల్లటి పెరుగు ...................... 1/2 కప్పు
పంచదార ............................. 4 టీస్పూన్లు
ఉప్పు .................................... చిటికెడు
మగ్గిన అరటిపళ్ళు ................ 2
వంట సోడా .......................... చిటికెడు
నూనె ..................................... వేయించడానికి
ఇలా చేయాలి
బాగా మగ్గిన అరటిపళ్ళను మెత్తగా మెదిపి ఉంచుకోవాలి. మైదా, గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు, వంట సోడా కలిపి జల్లించుకోవాలి. ఒక గినె్నలో ఈ పిండి తీసుకుని అందులో పెరుగు, అరటిపళ్ల ముద్ద, పంచదార వేసి కలిపి ముద్దలా వేయాలి. అవసరమైతే కొద్దిగా పాలు చిలకరించాలి. ఈ పిండి మరీ మృదువుగా కాకుండా కొద్దిగా గట్టిగా తడిపి మూతపెట్టి ఐదారు గంటలు వదిలేయాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకుని పొడి పిండి చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి. వీటిని మామూలు పూరీలకంటే కాస్త మందంగా వత్తుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి వత్తుకున్న పూరెలు లేదా బన్స్‌ని వేసి రెండువైపులా బంగారు రంగు వచ్చేలా కాల్చుకోవాలి. ఈ బన్స్‌ని అలాగే తినొచ్చు లేదా కొబ్బరి చట్నీ, కుర్మాతో సర్వ్ చేయొచ్చు.