కావలసినవి
బార్లీ గింజలు- 100 గ్రాములు
పెసర్లు/ పెసరపప్పు- 50గ్రాములు
ఉల్లిపాయ- 1
పచ్చిమిర్చి- 2
కరివేపాకు- 1 రెబ్బ
నూనె - 2 టీస్పూన్లు
ఇంగువ- చిటికెడు
జీలకర్ర - 1/4 టీస్పూన్లు
వండండి ఇలా
బార్లీ గింజలను నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టి, పొద్దున వడకట్టి ఉంచుకోవాలి. పెసర్లను లేదా పెసర పప్పును కూడా నీళ్లుపోసి రెండు గంటలు నానబెట్టాలి. కుక్కర్లో నూనె వేడిచేసి ఇంగువ వేయాలి.
తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపాలి. ఇప్పుడు నానబెట్టిన పెసర్లు లేదా పెసర పప్పు, బార్లీ వేసి కలిపి, తగినంత ఉప్పువేసి రెండు కప్పుల నీళ్ళుపోసి కలిపి మూతపెట్టి మెత్తగా ఉడికించాలి. సర్వ్ చేసేముందు కొద్దిగా నెయ్యి, కొత్తిమీర వేస్తే రుచి అమోఘంగా ఉంటుంది.
బార్లీ గింజలను నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టి, పొద్దున వడకట్టి ఉంచుకోవాలి.
english title:
barlee
Date:
Sunday, December 2, 2012