కావలసినవి
మైదా - 2 కప్పులు
బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్
వంట సోడా- 1/4 టీస్పూన్
ఉప్పు- చిటికెడు
దాల్చినచెక్క పొడి
- 1/2 టీస్పూన్
జాజికాయ పొడి - చిటికెడు
వెన్న - 1 కప్పు
పంచదార పొడి - 1 కప్పు
కండెన్స్‌డ్ మిల్క్ - 1/2 టిన్
(200గ్రా.)
వెనిల్లా ఎస్సెన్స్ - 1/2 టీస్పూన్
తురిమిన క్యారట్ - 1 1/2 కప్పు
బాదాం, జీడిపప్పు,
అక్రోట్లు, కిస్మిస్ - 1/2 కప్పు
పాలు - 1/2 కప్పు
ఇలా వండాలి
ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి కలిపి జల్లించాలి. తర్వాత వెన్న, పంచదార పొడి, కండెన్స్‌డ్ మిల్క్, వెనిల్లా ఎస్సెన్స్ వేసి నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. ఇందులో జల్లించిన మైదా, తురిమిన క్యారట్, సన్నగా కట్‌చేసిన డ్రైఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా పాలు కలుపుకోవాలి.
కేకు టిన్ను తీసుకుని లోపల అన్నివైపులా వెన్న రాసి మైదాపిండి వేసి మొత్తం అంటుకునేలా సర్ది కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని వేయాలి. ఓవెన్‌ని 180 డిగ్రీల వరకూ వేడిచేసి ఈ టిన్ను పెట్టి 45-50 నిమిషాలపాటు బేక్ చేయాలి. సన్నటి పుల్ల గుచ్చి తీస్తే పిండి అంటుకోకుండా ఉంటే కేకు తయారైనట్టే. చల్లారాక ముక్కలు గా కట్ చేసుకోవాలి.