కావలసినవి
చిన్న చేపలు లేదా చేప ముక్కలు
5-6
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీస్పూన్
గరం మసాలా పొడి- 1/2 టీస్పూన్
అజినొమొటొ- చిటికెడు
కారం పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి- 2 టీస్పూన్లు
మిరియాల పొడి- 1/2 టీస్పూన్
నిమ్మరసం - 2 టీస్పూన్లు
కార్న్‌ఫ్లోర్- 3 టేబుల్ స్పూన్లు
సోయాసాస్- 1 టీస్పూన్
తందూరీ కలర్- చిటికెడు
ఉప్పు- తగినంత
నూనె- వేయించడానికి
తయారు చేసేదిలా
ఈ వేపుడు చేయడానికి చిన్నసైజు చేపలు తీసుకుంటే అచ్చంగా అలాగే ఉపయోగించుకోవచ్చు లేదా పెద్ద సైజు చేపముక్కలు తీసుకోవచ్చు. చేపలను శుభ్రం చేసుకుని చాకుతో అక్కడక్కడ గాట్లుపెట్టి కాస్త ఆరనివ్వాలి. ఒక గినె్నలో అల్లంవెల్లుల్లి ముద్ద, కారంపొడి, ధనియాల పొడి, గరంమసాలా పొడి, మిరియాల పొడి, అజినొమొటొ, కార్న్‌ఫ్లోర్, కలర్, సోయాసాస్, తగినంత ఉప్పువేసి బాగా కలపాలి. ఇందులో నిమ్మరసం లేదా గడ్డపెరుగు వేసి కలిపి చేపలకు అన్నివైపులా పట్టించాలి. మూతపెట్టి వాటిని అలాగే గంటసేపు వదిలేయాలి.
తర్వాత బాణలిలో నూనె వేడిచేసి ఈ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. లేదా ఓవెన్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. వేగిన చేపలను ఉల్లిపాయ, నిమ్మకాయ ముక్కలతో కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.