కావలసినవి
బంగాళాదుంపలు- 250 గ్రాములు
పచ్చి కొబ్బరి తురుము- 1/2 కప్పు
ఉల్లిపాయ-1
పచ్చిమిర్చి-5
పసుపు- 1/4 టీస్పూన్
కరివేపాకు- 2 రెబ్బలు
ఆవాలు, జీలకర్ర - 1/4 టీస్పూన్
ఇంగువ- చిటికెడు
కొత్తిమీర తరుగు- 3 టీస్పూన్లు
ఉప్పు- తగినంత
నూనె- 3 టీ స్పూన్లు
వండండి ఇలా
బంగాళాదుంపలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి లేదా ముద్దలా నూరుకోవచ్చు. పాన్‌లో నూనె వేడి చేసి ఇంగువ వేసి, అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట లాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో పసుపువేసి కలిపి ఉడికించుకున్న బంగాళాదుంప ముక్కలు, తగినంత ఉప్పువేసి నిదానంగా వేపాలి. ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పచ్చికొబ్బరి తురుము, కొత్తిమీరవేసి కలుపుతూ కొద్దిసేపు వేయించి దింపేయాలి. ఈ కూర రొట్టెలకు చాలా బావుంటుంది.
బంగాళాదుంపలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
english title:
aloo
Date:
Sunday, December 2, 2012