పెళ్లిళ్లు స్వర్గంలో, కాపురాలు నరకంలో జరుగుతాయని కొందరు అంటారని, పెళ్లి అనేది ప్రతి మనిషిలోనూ ఓ తియ్యని అనుబంధంలా వుండాలని చెప్పేందుకే ‘పెళ్లి పుస్తకం’ ప్రయత్నమని చిత్ర దర్శకుడు రామకృష్ణ మచ్చకంటి తెలిపారు. లక్ష్మీ నరసింహ సినీ విజన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, బి.వి.గోపాల్, పి.సుమన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 75 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- ఈ నెల 6 నుండి 22 వరకు అనంతపురంలో కీలకమైన షెడ్యూల్ను చిత్రీకరించనున్నామని, ఇందులో టాకీపార్ట్తోపాటుగా మూడు పాటలు చేస్తామని తెలిపారు. జనవరిలో రెండు పాటలను విదేశాలలో చిత్రీకరించి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పెళ్లిపుస్తకం అన్న పేరు మాత్రమే బాపు చిత్రానికి పోలికని, ఆ కథకు ఈ కథకు ఎటువంటి సంబంధంలేదని చిత్ర దర్శకుడు తెలిపారు. రాహుల్, నీతి టేలర్ జంటగా నటించిన ఈ చిత్రంలో అనిల్, యశస్విని, దేశానంది, నాగినీడు, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం:శేఖర్ చంద్ర, మాటలు:మరుదూరి రాజా, కెమెరా:జవహర్ రెడ్డి, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, స్క్రీన్ప్లే, దర్శకత్వం:రామకృష్ణ మచ్చకంటి.
పెళ్లిళ్లు స్వర్గంలో, కాపురాలు నరకంలో జరుగుతాయని కొందరు అంటారని,
english title:
pelli
Date:
Monday, December 3, 2012