కావలసినవి
చికెన్ ముక్కలు- 100
గ్రాములు
శనగపిండి - 1 కప్పు
కార్న్ ఫ్లోర్- 1/2 కప్పు
వంట సోడా- చిటికెడు
మిరియాల పొడి 1/4 టీస్పూన్
కారం పొడి- 1/4 టీస్పూన్
అజినొమొటొ - చిటికెడు
సోయా సాస్ - 1/2 టీస్పూన్
ఉప్పు- తగినంత
నూనె- వేయించడానికి
వండే విధం
పెద్ద సైజు చికెన్ ముక్కలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక గినె్నలో శనగపిండి, కార్న్‌ఫ్లోర్, వంట సోడా, మిరియాల పొడి, కారం పొడి, అజినొమొటొ, తగినంత ఉప్పువేసి కలిపి సోయాసాస్, తగినన్ని నీళ్లుపోసి బజ్జీల పిండిలా గరిట జారుగా కలుపుకోవాలి. ఇందులో ఉడికించిన చికెన్ కీమా వేసి కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి చెంచాతో బజ్జీల్లా వేసి కరకరలాడేలా కాల్చుకోవాలి. ఈ బజ్జీలు వెంటనే తినాలి. చల్లారితే మరీ సాగుతాయి.
పెద్ద సైజు చికెన్ ముక్కలను ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి
english title:
chicken
Date:
Sunday, December 2, 2012