శ్రీయన గౌరినాఁ బరఁగుచెల్వకుఁ జిత్తము పల్లవింప భ
ద్రాయితమూర్తియై హరిహరంబగు రూపముఁ దాల్చి విష్ణురూ
పాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక
ధ్యాయిత కిచ్చ మెచ్చు పరతత్త్వముఁ గొల్చెద నిష్టసిద్ధికిన్.
తిక్కన మహాకవి ఆంధ్ర భారత రచన ఆరంభిస్తూ హరిహరనాథుని స్తుతించిన మంత్రమయమైన పద్యం.
భావం: ఆయన హరిహరనాథుడు. లక్ష్మీదేవి అనీ, గౌరీదేవి అని అందరూ అనుకొనే అమ్మవారి హృదయం చిగురించే విధంగా సర్వులకు మంగళాన్ని ప్రసాదించే ఆకారం కలవాడై హరిహరాత్మక రూపం ధరించాడు. భక్తులైన జనాలు విష్ణురూపాయ నమశ్శివాయ- విష్ణురూపం కల శివునకు నమస్కారం- అంటూ పలుకుతూ ఉంటారు. వారి వేదజ్ఞాన సహితమైన ధ్యానానికి అంతరంగంలో ఆనందపడుతూ ఉంటాడు. అటువంటి పరతత్త్వాన్ని ‘కోరినది నెరవేరటంకోసం’ మూడు కరణాలతో అర్చన చేస్తూ ఉంటాను.
ఆంధ్ర మహాభారతంలోని పద్యమిది నిర్వహణ: శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్
శ్రీపావని సేవా సమితి, హైదరాబాద్
english title:
n
Date:
Monday, December 3, 2012