హైదరాబాద్, డిసెంబర్ 4: కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన జిల్లాల కలెక్టర్లతో బుధవారం ఢిల్లీలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నది. రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన ఐదు జిల్లాల కలెక్టర్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్లాలజీ సెక్రటరీతో పాటు వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు ఢిల్లీ వెళ్ళారు. నగదు బదిలీలో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన 42 అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం తెల్లరేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డులో ఉన్న పేర్లు సరిపోవాలన్న నిబంధనను కేంద్రం జారీ చేయడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం ఎంపిక చేసిన వాటిలో రంగారెడ్డి, ఆదిలాబాద్, తూర్పు గోదావరి, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఇప్పటి వరకు కేవలం 45 శాతం మాత్రమే ఆధార్ కార్డుల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఆధార్ కార్డుతో తెల్లరేషన్ కార్డుల్లో ఉన్న పేర్లకు పోలిక లేకపోవడంతో మళ్ళీ ఆధార్, లేదా తెల్లరేషన్ కార్డులు కొత్తగా తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగదు బదిలీలో కేంద్ర, రాష్ట్రానికి చెందిన పథకాలకు చెందిన 42 అంశాలను అందులో చేర్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ రెడ్డి సుబ్రమణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్ ఢిల్లీ వెళ్ళారు. నగదు బదిలీలో పెన్షన్లు, విద్యార్థుల ఉపకార వేతనాలు, నిత్యావసర సరుకులు, గ్రామీణ ఉపాధి పథకం, స్కూళ్లకు చెందిన ప్యాకెట్ మనీ, రైతులకు ఇస్తున్న ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతరత్రా ప్రోత్సాహకాలకు చెందిన నగదును నేరుగా లబ్ధిదారులకు చెందేవిధంగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.
జూనియర్ అడ్వకేట్లకు శిక్షణ
9న ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 4 : ‘రాజీవ్‌గాంధీ ఆదివక్త ప్రశిక్షణా యోజన’ పథకం కింద జూనియర్ అడ్వకేట్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎ. నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఐదేళ్ల లోపు ప్రాక్టీస్ కలిగిన ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి, మహిళలతో పాటు అంగవైకల్యం కలిగిన అడ్వకేట్లకు శిక్షణ ఇస్తామన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నల్సార్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 12 లోగా ‘సెక్రటరీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ప్రిమిసెస్, హైదరాబాద్’కు పంపించాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపిక పూర్తయిన తర్వాత సదరు అభ్యర్థులకు శిక్షణకు సంబంధించిన తేదీలు తదితర వివరాలను పంపిస్తామని వివరించారు.
ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్‌ను ఈ నెల 9 న నిర్వహిస్తున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఎన్. రేణుక వేరొక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు హాల్ టిక్కెట్లను పంపించామని, వివరాలు ‘బార్‌కౌన్సిల్‌ఆఫ్‌ఇండియా.ఓఆర్‌జి’ వెబ్‌సైట్‌లో ఉన్నాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.
14న ‘గీతం’లో ట్రెండీస్ సదస్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 4: గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో ట్రెండీస్-2012ను నిర్వహించనున్నట్టు వర్శిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్ లక్ష్మణ్ దాస్ తెలిపారు. ట్రెండీస్ అనేది బయోకెమిస్ట్రీ, మాలిక్యూలర్ బయాలజీలో చోటు చేసుకుంటున్న మార్పులపై చర్చలను ప్రోత్సహించడానికి ఏర్పాటైన జాతీయవేదిక అని అన్నారు. నూతన భావనలు, సందేహాలు, ప్రగతి వంటి అంశాలపై దృష్టిసారించడం, ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడం ఈ సమావేశ లక్ష్యంగా లక్ష్మణ్‌దాస్ తెలిపారు. బెంగలూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ టి. రామశర్మ, ఎజె రావు, పి కొండయ్య, ఎంఎస్ శైల, జెఎన్‌టియుహెచ్ ప్రొఫెసర్ కె. సుబ్బారావు, కేంద్రీయ విద్యాలయ ప్రొఫెసర్ కె. ఆనంద్‌కుమార్‌లు ఈ సదస్సులో ప్రధానవక్తలుగా పాల్గొంటారని అన్నారు.
7నుండి ఆదివాసీ మహాసభలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 4: గిరిజనుల ఉప ప్రణాళిక అమలులో 35 ఉప తెగలకు సామాజిక న్యాయం జరిగేలా, అందరికీ ఆర్ధిక వనరులు సమానంగా అందించేలా ప్రభుత్వంపై వత్తిడి తేచ్చేందుకు ఈ నెల 7వ తేదీ నుండి రెండు రోజుల పాటు తిరుపతి శే్వత నిలయంలో ఆదివాసి మహాసభ నిర్వహించనున్నట్టు గిరిజన ఐక్యవేదిక ప్రధానకార్యదర్శి కె. వివేక్ వినాయక్ తెలిపారు. ఆదివాసులను చైతన్యవంతులను చేసేందుకు , గిరిజనుల్లో కూడా వర్గీకరణను తీసుకువచ్చేందుకు ఈ ఆదివాసి మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనేక పోరాటాలకు గిరిజనులే స్ఫూర్తి ప్రదాతలని కాని సభ్యసమాజం అలాంటి ఆదివాసులనే పాలక వర్గాల నుండి అన్ని రాజకీయ పార్టీల వరకూ ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతూ మోసపుచ్చుతున్నారని అన్నారు. మున్ముందు ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా మరో భారీ పోరటానికి నాంది పలుకుతున్నట్టు నాయక్ చెప్పారు.
నేడు స్వదేశీ జాగరణ్ మంచ్ సదస్సు
స్వదేశీ జాగరణ్ మంచ్ సదస్సును ఫ్యాప్సీ హాలులో బుధవారం నాడు నిర్వహించనున్నట్టు రాష్ట్ర కన్వీనర్ రాజమహేందర్‌రెడ్డి చెప్పారు. ఈ సదస్సులో అఖిల భారత ఆర్గనైజింగ్ కార్యదర్శి కాశ్మీరీలాల్ పాల్గొంటారని ఆయన చెప్పారు.
వార్డర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 4: జైళ్ల శాఖలో పురుష, మహిళా వార్డర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పోలీసు వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు రాష్టస్థ్రాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. 686 పురుష అభ్యర్థులు, 38 మంది మహిళా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది. ఇంటర్వూల తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన జాబితాను, ఇంటర్వ్యూకి హాజరు కాని అభ్యర్థుల జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు బోర్డు చైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఎంపిక చేసిన జిల్లాల కలెక్టర్లతో
english title:
n
Date:
Wednesday, December 5, 2012