Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఒకే కాన్పులో నలుగురు

$
0
0

మదనపల్లె, డిసెంబర్ 4: వివాహం జరిగి 15 ఏళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో మొక్కని దేవుళ్లు లేరు..తిరగని దేవాలయాలు లేవు. ఏ దేవుడు వరమిచ్చాడో.. మంగళవారం మధ్యాహ్నం ఒక వివాహిత ఒకే కాన్పులో నలుగురుకి జన్మనిచ్చింది. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామానికి చెందిన శ్రీరాములు, గౌరమ్మకు 14 ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరిరువురు కూలీపనులు చేసుకుని జీవించే వారు. సంతానం కోసం పలు దేవుళ్లకు మొక్కారు. గర్భం దాల్చిన గౌరమ్మ పురుటి నొప్పులతో సోమవారం రాత్రి మదనపల్లె పట్టణంలోని బాలాజి ఆసుపత్రిలో చేరింది. కాన్పులో ఒక ఆడపిల్ల, ముగ్గురు మగపిల్లలు జన్మించారు. తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారు. అయితే జన్మించిన వారికి వెంటనే ఇంక్యుబేటర్ చాలా అవసరమని వైద్యులు చెప్పడంతో 108లో మదనపల్లె తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి చిన్నపిల్లల నిపుణుల ప్రైవేట్ ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్‌లో ఉంచాలని సలహా ఇచ్చి పంపించేశారు. ఎడతెరపిలేని జడివాన, చల్లనిగాలికి ఆ పిల్లలను పలు ఆసుపత్రులన్ని తిప్పుకుని మరలా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.
ఇంటర్ విద్యార్థిపై
వైస్ ప్రిన్సిపాల్ దాడి!
అనంతపురం సిటీ, డిసెంబర్ 4: స్టడీ అవర్స్‌కు హాజరుకాలేదనే నెపంతో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని వైస్ ప్రిన్సిపాల్ చితకబాదిన సంఘటన ఇది. పుట్టుకతోనే ఓ కన్ను కనిపించని ఆ విద్యార్థి వైఎస్ ప్రిన్సిపాల్ నిర్వాకంతో రెండవ కన్ను కోల్పోయే పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లికి చెందిన మల్లికార్జున నగరంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం సిఇసి చదువుతున్నాడు. మల్లికార్జున సోమవారం ఉదయం స్టడీ అవర్స్‌కు హాజరుకాలేదు. అయితే అదేరోజు కళాశాలకు హాజరుకావడంతో కోపోద్రిక్తుడైన కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ్ధర్ కర్రతో కొట్టడంతో మల్లికార్జున ఎడమ కన్నుకు దెబ్బ తగిలింది. దీంతో తోటి విద్యార్థులు మల్లికార్జున తల్లిదండ్రులకు విషయం తెలియజేయగా వారు మంగళవారం కళాశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
యుపి దొంగల ముఠాను
వెంబడించి పట్టుకున్న పోలీసులు
విశాఖపట్నం, డిసెంబర్ 4: వాచ్‌మేన్‌ను బంధించి పట్టపగలే ఇంటిని లూటీ చేసి పరారైన యుపి దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నగర సమీపంలోని దువ్వాడ జోన్ పోలీస్‌స్టేషన్ పరిధి రాజీవనగర్ వుడా కాలనీ ఫేజ్-7లో మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలిలావున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో లక్ష్మిత అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్‌ను బాత్‌రూమ్‌లో బంధించిన నలుగురు వ్యక్తులు ఐదో అంతస్తులోని ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ దుండగులు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో ఉన్న నీలం రంగు హోండా కారులో వచ్చారు. 15 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరావుతున్న వీరి కోసం కారు నెంబర్ ఆధారంగా పోలీసులు గాలింపు ప్రారంభించారు. నక్కపల్లి వద్ద పోలీసులను తప్పించుకుని కారు వేగంగా వెళ్లిపోయింది. సుమారు అరగంట వెంబడించిన పోలీసులు తరువాత కారును పట్టుకున్నారు. ఈ ముఠా నుండి కిలోన్నర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
శ్రీరామగిరి క్షేత్రంలో
హుండీ చోరీకి యత్నం
సీతంపేట, డిసెంబర్ 4: రాష్ట్రంలో రెండవ భద్రాచలంగా పేరు పొందుతున్న శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని కనె్నధార కొండపై వెలసిన శ్రీరామగిరి క్షేత్రంలో హుండీ చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. శ్రీరామగిరి క్షేత్రంలోని పర్ణశాలలో హుండీ చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఆంజనేయుడి విగ్రహం కింద పడిపోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నెలలో ఇదే క్షేత్రంలో సీత, లక్ష్మణస్వామి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఒక పక్క కనె్నధార కొండ లీజులపై స్థానికులు పోరాడుతుంటే మరోపక్క ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం.
ఇక కాలుష్య రహిత నౌకలు
* మారీటైం వర్శిటీ క్యాంపస్ డైరెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, డిసెంబర్ 4: సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలు విడుదల చేస్తున్న కాలుష్యాన్ని నివారించేందుకు కాలుష్య రహిత నౌకలను త్వరలో రంగంలోకి దించుతున్నట్టు ఇండియన్ మారీటైం యూనివర్శిటీ క్యాంపస్ డైరక్టర్ ఎస్‌సి మిశ్రా తెలియచేశారు. మంగళవారం విశాఖలో విలేఖర్లతో మాట్లాడుతూ కాలుష్య రహిత నౌకలను ఇండియన్ మారీటైమ్ యూనివర్శిటీ రూపకల్పన చేసి దీనిపై పరిశోధన చేస్తోందని చెప్పారు. నౌకల విడుదల చేస్తున్న కాలుష్యంతో సుముద్ర జలాలు రోజు రోజుకూ కలుషితమైపోతున్నాయన్నారు. దీని వల్ల జలచరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు. తొలి కాలుష్య రహిత నౌకను ముంబైలోని భారతీయ షిప్‌యార్డు తయారు చేస్తోందని తెలిపారు. నార్వేలో ఓ సంస్థ దీనిని తయారు చేయిస్తోందని అన్నారు. ఈ నౌక తయారీకి అవసరమైన సాంకేతిక సహకారాన్ని బ్రిటన్ నుంచి తీసుకుని, కొంత స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామని ఆయన వివరించారు. కాలుష్య రహిత నౌకలతో కాలుష్య నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. నౌకల నుంచి విడుదలయ్యే కాలుష్యకారక పదార్థాల శాతాన్ని తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలియచేశారు. కాగా సముద్ర జలాల్లోని కాలుష్యం, దాని నివారణపై టెక్ సముద్ర-2012 పేరుతో ఒక సదస్సును ఈనెల ఆరవ తేదీన విశాఖలో నిర్వహిస్తున్నామని మిశ్రా వివరించారు.

సూట్‌కేసు బాంబు కేసులో మంగలి కృష్ణకు విముక్తి
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, డిసెంబర్ 4 : పెనుకొండ మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రను హత్య చేయడానికి సూట్‌కేసు బాంబును తయారుచేసి ఉంచారన్న కేసు నుంచి కడప జిల్లా పులివెందులకు చెందిన మంగలి కృష్ణ అలియాస్ దంతలూరి కృష్ణకు విముక్తి లభించింది. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. 2006లో అనంతపురం రైల్వేస్టేషన్ వద్ద సూట్‌కేసులో బాంబు తీసుకు వెళ్తున్నాడన్న అనుమానంతో దంతలూరి కృష్ణ అలియాస్ మంగలి కృష్ణతోపాటు మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పరిటాల రవీంద్రను హతమార్చడానికి పథకం వేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన అప్పటి అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సత్యవాణి 2012 ఏప్రిల్ నెలలో మంగలి కృష్ణతోపాటు డోలా రామచంద్రారెడ్డి, రవీంద్రరెడ్డి, సుబ్బిరెడ్డి అనే నలుగురికి ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దీనిపై వారు జిల్లా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. కేసును విచారించిన అడిషనల్ జిల్లా జడ్జి సుబ్రమణ్య కుమార్ (నాల్గవ ఫాస్ట్‌ట్రాక్) వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు.

వివాహం జరిగి 15 ఏళ్లు గడిచినా సంతానం లేకపోవడంతో మొక్కని దేవుళ్లు లేరు..తిరగని దేవాలయాలు
english title: 
o

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>