గుడివాడ, డిసెంబర్ 4: వెన్నుపోటు పొడవడంలో ఔరంగజేబు కన్నా చంద్రబాబునాయుడే ప్రమాదకరమైన వ్యక్తి అని, ఈ మాటను సాక్షాత్తూ ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అన్నారని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. స్థానిక వైఎస్సార్‌సిపి కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మంగళవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నపుడు చంద్రబాబును ద్రోహిగా, వెన్నుపోటుదారుగా, నయవంచకుడిగా ఎన్టీఆర్ అన్న మాటలనే తానూ అంటే అవి కారుకూతలు ఎలా అవుతాయని బాలకృష్ణను ఉద్దేశించి అన్నారు. ‘గుడివాడ నా అబ్బ సొత్తు’ అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజల సొత్తు అని, 1994లో లక్ష్మీపార్వతి కాళ్ళు పట్టుకుని రావి శోభనాద్రిచౌదరి సీటు దక్కించుకుని చివరకు ఎన్టీఆర్ సొత్తును చంద్రబాబుకు తాకట్టు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన ద్రోహులను ఆయన అభిమానిగా ఉన్న నేను విమర్శిస్తే తప్పెలా అవుతుందని నాని ప్రశ్నించారు. వైశ్రాయ్ హోటల్‌లో ఎన్టీ ఆర్‌పై చెప్పులు విసిరిన ఘనత రావి కుటుంబానిదని అన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడ్చిన మాదిరిగా బాలకృష్ణను కూడా వెన్నుపోటు పొడిచేందుకు మేక వనె్న పులులు ప్రయత్నిస్తున్నాయని, దీనిలో భాగంగానే బాలకృష్ణను జిల్లాకు తీసుకువచ్చి తనను విమర్శించేలా చేయడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్‌కు, నియోజకవర్గ ప్రజలకు రావి కుటుంబం చేసిన ద్రోహాన్ని జగన్ పక్షాన తాను జీవించినంత కాలం ఎండగడుతూనే ఉంటానన్నారు. గుడివాడ సీటును గెల్చి జగన్‌కు అప్పగించకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోతానన్నారు. పార్టీకి ఎదురుగాలి వీచినపుడు వరుసగా రెండుసార్లు గెల్చానని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రావి కుటుంబం ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తూ గుడివాడలో మున్సిపాలిటీని గెలిపించలేకపోయారన్నారు. నిత్యం రాజశేఖరరెడ్డిని తిడుతూ చంద్రబాబు సంస్కారం లేని వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారన్నారు. జగన్ జైల్లో లేరని, ప్రజల గుండెల్లో ఉన్నారని, రేపోమాపో బయటకు వచ్చి డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గుడివాడలో బాలయ్య పోటీ చేసినా జగన్ ఆదేశించిన ప్రకారమే నడు
గుడివాడలో గెలవకపోతే రాష్ట్రానే్న వదిలేస్తా ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్
english title:
o
Date:
Wednesday, December 5, 2012