Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రుద్రుడు

$
0
0

ఆయన రుద్రుడు. ఆమె రుద్రాణి. ఆయన శివుడు. ఆమె శివా. ఇద్దరు సమాన ధర్మములు గలవారు. శివ అనగా ముక్తి స్వరూపుడని, మంగళ స్వరూపుడని భావన.
ఈశ్వరునకు రెండు శరీరములు. ఒకటి ఘోర శరీరము. రెండవది శివా శరీరము. ఘోర శరీరము గలవాడు రుద్రుడు.
రుద్ర శబ్దము అనేక విధములుగా నిర్వచించబడినది. ‘‘రుజాం ద్రావణతోరుద్రః’’ సకల రోగహరుడు. భక్తులనుండి జ్ఞాన ప్రతిబంధకము మోహకమగు శక్తిని తొలగించువాడు. శబ్దమును ఇచ్చునట్టి ప్రాణమే రుద్రుడు. చివరకు శుత్య్రనుసారము అగ్నియు, రుద్రుడు ఒక్కటే. ఆ శ్రుతియే ప్రళయకాలమందు సంహారముచె అంతయు రోదనము చేయువాడు గనుక రుద్రుడని నామమని పేర్కొన్నది.
రుద్రుడు మహాదేవుడు. అగ్ని మండలాధిపతి. శివమహాస్తోత్రమునందు ఎనిమిది శ్లోకములలో రుద్రనామ విశదీకరణ చెప్పబడ్డది. ‘విశ్వాధికో రుద్రో మహర్షి’ విశ్వముకన్న మించినవాడు.
శివపూజలయందు నమకము, చమకము రెండు సూక్తములు తప్పక వినియోగించెదరు. రుద్రుని ఘోర శరీరము క్రోధ ప్రధానమైనది. ప్రసన్నత కొరకు నమ శబ్దముతో ‘నమస్తే రుద్ర మన్యవ ఊతోత ఇషవే నమః’’ అని నమకము ప్రారంభమవుతుంది. ప్రథమానం వాకముచే రుద్రుని ప్రసన్నునిగా చేసి, అతని ధనుర్భాణాది సాధనములను కూడ ఉపసంహరింపచేసి, ఎనిమిది అనువాకములచే రుద్రుని విశ్వరూపత్వముచే స్తుతించి నమస్కరించుట. ఈ అనువాకములు నమస్కార మంత్రమలు.
నమకమందు గల మంత్రములు జప, హోమ అర్చనాదులయందు వినియోగించి, రుద్రత్వమును విడిపించుకుని, శివునిగా మార్చిన పిమ్మట చమకము ‘వాజుశ్చమే’ ప్రారంభింపబడిన పదకొండు అనువాకములు గల మంత్రములు అభీష్ట ఫలము పొందుటకు వినియోగించెదరు. ఏతా వాతా శివార్చనాదుల యందు నమక, చమకములు వినియోగ ప్రాముఖ్యమును, యిందువలన కలుగు ఫలితములను శ్రుతులు బోధిస్తున్నాయి.
నమక చమకములను పూర్తిగా జపాభిషేకములందు చెప్పుట రుద్రమందురు. నమకము పూర్తిగా చెప్పి చమకము ఒక్కొక్క అనువాకము వంతున పదకొండు మారులు చెప్పిన రుద్ర ఏకాదశి అని అందురు.
పూర్వకాలమందు అనగా మనకు స్వాతంత్య్రము సంప్రాప్తించకముందు వరకు ప్రతి యింటను శివ పంచాయతన పూజ చేయుచు నమక, చమకములచే ప్రతి దినము అభిషేకముచేయు ఆచారముగలదు. ఇంటి దేవతార్చన లేని వారలు కూడా ప్రతిదినము నమక పారాయణతో ఆలయములలో అభిషేకము చేయుట లేదా యితరులచే యుంచుట సంప్రదాయముగా నుండేది. ప్రతి నెల మాస శివరాత్రి యందు దేవాలయమునందు నమక చమకములతో అభిషేకము చేయించువారుగలరు. జన్మదినము రోజున తప్పక నమక, చమకములతో అభిషేకము శివార్చన ఆయురారోగ్య సిద్ధి ప్రదమైనది. రుద్ర పారాయణవలన సర్వ పాపములు నశించును సమస్త రోగములు ఉపశమించును. సకల సంపదలు కలుగును. రుద్రాధ్యయమునందుగల మంత్రములు, ఇష్టప్రాప్తి, అనిష్ట, పరిహారము కలుగజేయును. శ్రుతి గ్రామము నందు పట్టణమందు గల దేవాలయములలో ప్రజాక్షేమము కొరకు నిత్యము నమక, చమకములతో శివార్చన జరుపుట మంచిది. ఇది ఆలయ పాలక మండలి కర్తవ్యము. ఆశ్వయుజ మాసమందు అమ్మవారిని ఆరాధిస్తాము. కార్తీక మాసమందు కామేశ్వరుని కొలుస్తాము.

మంచిమాట
english title: 
rudrudu
author: 
-జె.సి.శాస్ర్తీ

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles