కావలసినవి
కొబ్బరి పొడి - 2 కప్పులు
కండెన్స్ మిల్క్ - 1/2 కప్పు
జీడిపప్పు - 10
బాదాం పప్పు - 10
పిస్తా పప్పు - 10
కిస్‌మిస్ - 15, లవంగాలు - 5
యాలకుల పొడి - 1 టీ.స్పూ.
నెయ్యి - 2 టీ.స్పూ.
ఇలా వండాలి
కొబ్బరిని మెత్తగా పొడి చేసుకోవాలి. లవంగాలు కూడా పొడి చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొబ్బరి పొడి, కండెన్స్ మిల్క్ వేసి కలుపుతూ ఉడికించాలి. మొత్తం ఉడికి దగ్గర పడ్డాక వేయించిన పలుకులు, లవంగాల పొడి, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. మిశ్రమం బాగా ఉడికి అంచులు వీడి ముద్దలా అవుతున్నప్పుడు దింపేసి నెయ్యి రాసిన పళ్ళెంలో వేసి సమానంగా పరవాలి. చాకుతో కట్ చేసి చల్లారిన తర్వాత విడిగా తీయాలి.
కొబ్బరిని మెత్తగా పొడి చేసుకోవాలి. లవంగాలు కూడా పొడి చేసుకోవాలి.
english title:
coconut, nuts burfy
Date:
Sunday, December 9, 2012