కావలసినవి
చికెన్ ముక్కలు - 1/4 కప్పు
నూడుల్స్ / మాగీ నూడుల్స్
- 1/2 కప్పు
ఉల్లిపొరక - 1/4 కప్పు
అజినోమొటో - చిటికెడు
సోయా సాస్ - 1/2 టీ.స్పూ.
కార్న్‌ఫ్లోర్ - 2 టీ.స్పూ.
మిరియాల పొడి - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కారం పొడి - 1/4 టీ.స్పూ.
నూనె - 2 టీ.స్పూ.
వండండి ఇలా
చికెన్ ముక్కలను నీళ్లు పోసి మెత్తగా ఉడికించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వడ కట్టిన నీటిని పారేయకుండా ఒక గినె్నలో తీసి పెట్టుకోవాలి. ఉల్లిపొరక కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపొరక, చికెన్ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేపాలి. ఇందులో పసుపు, కారం పొడి కూడా వేసి మరికొద్దిసేపు వేపి చికెన్ ఉడికించిన నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో అజినోమొటో, సోయా సాస్, నూడుల్స్‌వేయాలి. మాగీ నూడుల్స్ ఐతే అలాగే వేయాలి. వేరే నూడుల్స్ ఐతే విడిగా సగం ఉడికించి వేయాలి. చివరిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపాలి. పావు కప్పు నీళ్లలో కార్న్‌ఫ్లోర్ ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమం మరుగుతున్న సూప్‌లో వేసి కలుపుతూ ఉండాలి. దీనివల్ల సూప్ ఉండలు కట్టకుండా ఉం టుంది. రెండు నిమిషాలు మరిగిన తర్వాత దింపేసి సన్నగా తరిగిన ఉల్లిపొరక ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి.