కావలసినవి
గోధుమ పిండి ....... 1 కప్పు
వాము .... 1/4 టీ.స్పూ.
కొత్తిమీర, పుదీనా ....... 1/4 కప్పు
పచ్చిమిర్చి .................. 2
ఉల్లిపాయ .................. 1 చిన్నది
అల్లం వెల్లుల్లి ముద్ద ... 1 టీ.స్పూ.
ఉప్పు .....తగినంత
నూనె ..... 3 టీ.స్పూ.
తయారుచేసేదిలా
గోధుమ పిండిలో చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని మూత పెట్టి ఉంచాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వాము, అల్లం వెల్లుల్లి ముద్ద కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తడిపిన పిండి మృదువుగా అయ్యేలా మరోసారి మర్దనా చేసి కొంచెం పెద్ద సైజు ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను కొద్దిగా వెడల్పుగా వత్తుకుని నూనె రాసి పొడి పిండి చల్లి మడత పెట్టాలి. ఇంకోసారి నూనె రాసి పొడి చల్లి మడత పెట్టాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఈ చపాతీలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పాన్‌లోనూనె వేడి చేసి నూరి పెట్టుకున్న గ్రీన్ మసాలా ముద్ద వేసి కొద్దిగా వేయించి రెండు కప్పు నీళ్లు పోయాలి. అవి మరుగుతుండగా చపాతీ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి. చపాతీ ముక్కలు ఉడికి చిక్కబడ్డాక దింపేయాలి. ఇష్టమున్నవారు నిమ్మరసం పిండుకోవచ్చు. దీన్ని వేడిగానే సర్వ్ చేయాలి.