సాధారణంగా యూరప్‌లోని పర్యాటక కేంద్రాల్లో అధిక భాగం వేసవిలోనే దర్శించగలం. చలికాలంలో అంటే అక్టోబర్‌నుంచీ ఏప్రిల్ దాకా మంచువల్ల, చలివల్ల దర్శించలేం. కానీ చాలా యూరోపియన్ దేశాలు మంచు కురిసే చలికాలం కూడా పర్యాటకులు వచ్చేందుకు అనువుగా వింటర్ స్టోర్ట్స్‌తో పర్యాటక కేంద్రాలని తీర్చిదిద్దారు. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఉష్ణ దేశస్థులైన మనకి ఇవి ఆహ్లాదాన్ని కలిగించే కేంద్రాలు. బ్రిటన్‌నుంచి మొదలుపెట్టి వీటన్నిటినీ వరసగా ఓ డిసెంబర్ నెలలో చూసుకుంటూ సాగొచ్చు. మొత్తం ప్రయాణం యూరోపాస్ తీసుకుని రైల్లో కొనసాగించవచ్చు. లండన్‌కి మాత్రం బాంబే, ఢిల్లీనుంచి విమానంలో వెళ్లచ్చు. ఆఖరి పర్యాటక గమ్యం నుంచి తిరిగి విమానంలో వెనక్కి తిరిగి రావచ్చు.
డిసెంబర్ నెలలో నిత్యం లండన్‌లోని సెయింట్ పేంద్రీస్ రైల్వే స్టేషన్‌నుంచి ఫ్రాన్స్ దేశంలోని టారెంటైస్‌కి వెళ్తుంటాయి. దారిలో మీటియర్స్, ఎయిమ్‌లాప్లాగ్నె, చుర్గ్‌సెయింట్ మారిస్‌లలోను దిగి అక్కడి వింటర్ పర్యాటక కేంద్రాలను తిలకించవచ్చు. ఈ రైలు లండన్‌నుంచి ఉదయం 10కి బయలుదేరి, ఆఖరి స్టేషన్‌ని సాయంత్రం 6.51కి చేరుకుంటుంది. ఆ రైలు మార్గానికి అటు ఇటు మంచు కప్పబడ్డ పర్వతాలని, పీఠ భూములని రైలు దిగకుండా తిలకించవచ్చు. మళ్లీ మర్నాడు రాత్రి 9.24కి బయలుదేరి లండన్‌కి ఉదయం 4.11కి చేరుకోవచ్చు. వెళ్లి రావడానికి టికెట్ ఖరీదు 149 పౌన్లు. డిసెంబర్ 22నుంచి ఏప్రిల్ 6 దాకా ఈ రైలు నిత్యం నడుస్తూ ఉంటుంది. వెళ్లాక ఎన్ని రోజులైనా ఫ్రాన్స్‌లోని వింటర్ రిసార్ట్‌లో గడిపి తిరిగి లండన్‌కు అదే టిక్కెట్‌తో చేరుకోవచ్చు.
లండన్‌నుంచి స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వతాల్లోని వింటర్ రిసార్ట్‌కి కూడా రైల్లో ఇలాగే వెళ్లి రావచ్చు. లండన్‌నుంచి ఫ్రాన్స్‌లోని టారంటైన్‌కి హోటల్‌నుంచి బయలుదేరిన 10 గంటలకి చేరుకుంటాం. అదే విమానంలో ఐతే హోటల్‌నుంచి బయలుదేరి నప్పటినుంచి గమ్యానికి చేరుకోవడానికి ఎనిమిది గంటలు పడుతుంది. రైల్లోంచి లభ్యమయ్యే సీనరీలు విమానంలో లభ్యం కావుకాబట్టి ఈ రైలుని అత్యధిక శాతం పర్యాటకులు వినియోగించుకుంటున్నారు. విమానానికి అంత సమయం తీసుకోడానికి కారణం మూడు గంటల ముందు చెకిన్, విమానం దిగాక ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటపడడానికి గంట సమయం వెచ్చించడమే.
లండన్‌నుంచి యూరో రైల్లో స్విట్జర్లాండ్‌కి కూడా వెళ్లి రావచ్చు. పేరిస్‌లోని బ్రిగ్ అనేచోట ఇందుకు రైలు మారాల్సి ఉంటుంది. లేసిన్, విల్లర్స్, ఇంటర్‌లేకెన్, లెస్‌డమీ బ్లెరెట్స్, రెస్‌పోర్టెస్ మొదలైన రిసార్ట్‌లకి రైల్లో వెళ్లొచ్చు. ఇందుకు లండన్‌నుంచి 189 పౌన్లు టిక్కెట్ ధర ఉంటుంది. లండన్ నుంచి పేరిస్ మీదుగా జెనీవాకి 6 గంటల 15 నిముషాల్లో చేరుకోవచ్చు. అక్కడనుంచి ఆల్ప్స్ పర్వతాల్లోని వివిధ వింటర్ రిసార్ట్స్‌కి బస్‌లో లేదా కార్లో చేరుకోవచ్చు.
ఆల్ప్స్ పర్వతం స్విట్జర్లాండ్‌లోనే కాక ఆస్ట్రియా దేశంలో కూడా ఉంది. పేరిస్‌నుంచి ఆస్ట్రియన్ ఆల్ప్స్ రిసార్ట్స్‌కి రాత్రి ఓ రైలు వెళ్తుంది. సీన్‌పుర్న్, సాల్‌బాన్ హింటర్‌గ్లెమ్-లియోగేంగ్ మొదలైన వింటర్ రిసార్ట్స్ అక్కడ సందర్శించవచ్చు. పేరిస్‌నుంచి జర్మనీలోని మ్యూనిచ్‌కి కూడా రైల్లో వెళ్లి అక్కడనుంచి వింటర్ రిసార్ట్స్‌కి చేరుకోవచ్చు. బస్‌లో సీట్లు ముందే బుక్ చేసుకుంటే రిసార్ట్స్‌కి చేరడం తేలిక. ఇంకా పేరిస్‌నుంచి ఇటలీలోని జోల్క్స్‌కి సెస్ టైయరికి కూడా రైల్లో వెళ్లి వింటర్ స్పోర్ట్స్‌లో పాల్గొనవచ్చు. లండన్‌నుంచి ఇందుకు 7 గంటల 54 నిముషాలు పడుతుంది.
స్కీయింగ్ ప్రధాన వింటర్ స్పోర్ట్. రోప్‌వే మీద పర్వత శిఖరం మీదకి చేరుకుని అక్కడనుంచి కిందకి పాదాలకి స్కేట్ బోర్డ్‌ని కట్టుకుని జారడమే స్కీయింగ్ అంటే. కుక్కలు లాగే స్లెడ్జ్ బళ్లల్లో ప్రయాణం మరో వినోదం. రాత్రిళ్లు చలిమంట వేసుకుని కొత్తవాళ్లతో కలిసి వైన్ తాగుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ జోకులు చెప్పుకుంటూ గడపడం అరుథైన అనుభవం. లేదా రాత్రిళ్లు ఆప్రా (నాటకశాల)లకి లైదా నైట్ క్లబ్‌లకి వెళ్లి గడపచ్చు. వింటర్ రిసార్ట్స్‌లో నైట్ లైఫ్ బాగుంటుంది. మన దేశస్తులకి ఇది చక్కటి పర్యాటక యాత్ర అవుతుంది.
సాధారణంగా యూరప్‌లోని పర్యాటక కేంద్రాల్లో
english title:
cha
Date:
Sunday, December 9, 2012