అజీర్ణం వల్ల పొట్ట ఉబ్బరంగా ఉన్నపుడు పుదీనా రసం తీసుకుంటే గుణం కనిపిస్తుంది. బహిష్టులో నొప్పి ఉన్నపుడు పుదీనా ఆకు కషాయాన్ని మూడు లేదా నాలుగు రోజుల ముందు నుంచీ తీసుకుంటుంటే నొప్పి రాకుండా ఉంటుంది.
పుదీనా ఆకు రసంలో ఒక చెంచాడు నిమ్మరసం, కొద్దిగా తేనె, అల్లం రసం కలిపి రోజూ రెండు పూటలా తీసుకుంటే మహిళలకు అన్నివిధాలా ఆరోగ్యంగా ఉంటుంది.
కాంటాక్ట్ లెన్స్‌లు ఉపయోగించేవారు వాటిని వేకువ జామునే ఉపయోగించాలి. లెన్స్‌ని రోజుకి 10 నుండి 12 గంటలు మాత్రమే ఉపయోగించాలి. లెన్స్‌ని ఉపయోగిస్తున్నప్పుడు కళ్ళను నలపకూడదు.
కళ్ళు ఎర్రబారినా, ఇన్‌ఫెక్షన్ వచ్చినా లెన్స్‌ని ఉపయోగించకుంటేనే మంచిది. ఆ సమయంలో వైద్య సలహాలను విధిగా పాటించాలి. ముఖ్యంగా కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుని అలాగే నిద్రపోకూడదు. వీటిని రోజుకు రెండుసార్లు శుభ్రం చేయాలి. లెన్స్‌ను వాటికి సంబంధించిన సొల్యూషన్‌తోనే శుభ్రం చేయాలి.
అజీర్ణం వల్ల పొట్ట ఉబ్బరంగా....
english title:
idea
Date:
Monday, January 30, 2012