పల్లీలు తిని చాలా రోజులయ్యంది. ఇవి భలే రుచిగా ఉన్నాయే...2అరె ఎండు ఖర్జూరాలు ఎపుడూ తిననే లేదు. ఇంత బాగుంటాయని తెలిస్తే తప్పకుండా తినేదానిని...22
కొంతమంది ఇలా మాట్లాడుతుంటే మరి కొంతమంది ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే అన్నిరకాల ఆహార పదార్థాలను విరివిగా తింటుంటారు కానీ.. నట్స్ తినటం మాత్రం అరుదుగానే జరుగుతుంటుంది. కానీ గతంలో అలా కాదు. బఠాణీలు, ఉప్పుశెనగలు, మరమరాలు, అటుకులు, బాదం పప్పు, జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఇళ్ళల్లో దాచుకుని మరీ తినటం అలవాటు.
ఇపుడా అలవాటు పోయి ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయిన తర్వాత డాక్టర్లు రోజూ గుప్పెడు నట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని2 చెప్పిన తర్వాతగానీ మన దృష్టి అందరికీ చిరపరిచితమైన నట్స్‌ను కొని తెచ్చుకొని తినటం మొదలుపెట్టడంలేదు. ప్రతిరోజూ నట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందన్న విషయాన్ని పరిశోధకులు ప్రయోగపూర్వకంగా పరిశీలించి మరీ చెబుతున్నారు. అమెరికాలోని లోమా లిండా యూనివర్సిటీ బృందం చేసిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడి అయింది. వీటికి పంచదార లేదా నూనె వంటి పదార్థాలను చేర్చకుండా నేరుగా తీసుకోవాలి. ప్రస్తుతం ఈ విషయాన్ని ప్రయోగ పూర్వకంగా పరిశీలించి చూడటం కూడా జరిగింది. కొందరికి ప్రతిరోజూ 67గ్రాముల నట్స్‌ను ఇచ్చారు. ఇలా మూడు వారాలు చేయడంవల్ల వాళ్ళ రక్తంలో హృద్రోగానికి కారణమయ్యే కొలెస్ట్రాల్ శాతం చాలా తగ్గింది. పరిశోధనలు ఫలించి కొలెస్ట్రాల్ తగ్గుదలకు కారణమైన డ్రైఫ్రూట్స్‌ను ఎక్కువగా ఆహార పదార్థాలుగా తీసుకోవడంవలన ఆరోగ్యానికి జరిగే మంచి చాలా ఎక్కువ వాస్తవంగా నిరూపించబడింది. ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్‌ను ఎక్కువగా తినడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
-హెచ్
english title:
dryfruits
Date:
Monday, January 30, 2012