హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ట్రంలో ఉద్యమాల సందర్భంగా జరిగిన విధ్వంసాల్లో క్షమించమని అడిగితే విధ్వంసకారులపై కేసులు ఎత్తివేస్తారా! అంటూ తెలుగుదేశం ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మంగళవారం శాసన మండలిలో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ రాష్ట్రంలో ప్రాంతాలకు అతీతంగా ఉద్యమాలు జరిగాయని అందువల్ల ఎత్తివేస్తే అన్ని కేసులు ఎత్తివేయాలని ఆయన సూచించారు. కేసుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాలన్న ఆయన ఎలాంటి ఒత్తిడులకు లొంగినా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో 22వేల కేసులు ఉన్నాయని చెప్పారు. అంతకుముందు ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ధ్వంసం చేసిన సంఘటనలో కేసులు ఎత్తివేయలని డిమాండ్ చేశారు. విగ్రహం ధ్వంసం జరిగినప్పుడు తాను ఆ సమయంలో నాగోల్‌లో ఉన్నానని, తనపై అక్రమ కేసులు బనాయించడం ఏమిటని దిలీప్‌కుమార్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విగ్రహం కేసులో విమలక్కతోపాటు కేశవరావు, ఉస్మానియా వర్సిటిలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జాదవ్ ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే దాడి వీరభద్రరావు పైవిధంగా స్పందించారు. దీంతో సభలో కొంత ఉద్రిక్తత నెలకొనడంతో కేసుల విషయంలో ప్రభుత్వంతో చర్చించాలని మండలి చైర్మన్ చక్రపాణి సూచించారు.
ప్రభుత్వాన్ని నిలదీసిన టిడిపి ఎమ్మెల్సీ దాడి క్షమించమంటే..
english title:
k
Date:
Wednesday, December 12, 2012