న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మాతృ రాష్ట్రం నుంచి విస్తృతస్థాయిలో ఏకాభిప్రాయం లభించిన తరువాతే వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని చిన్న రాష్ట్రాలను ఏర్పాటుచేసే విషయంపై ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో పికె బిజూ, రాజకుమారి చౌహాన్‌లు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణతోపాటు మహారాష్టల్రో విదర్భ, కర్నాటకలో కూర్గ్, గుజరాత్‌లో సౌరాష్ట్ర, ఒడిషాలో కోశాంచల్, పశ్చిమబెంగాల్‌లో గూర్ఖాలాండ్, బీహార్‌లో మిత్తలాంచల్‌లను చిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ విజ్ఞప్తులు అందినట్లు తెలిపారు.
అలాగే ఉత్తరప్రదేశ్‌ను పూర్వంచల్, బుందేల్‌ఖంఢ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమప్రదేశ్‌లుగా విభజించాలని కోరుతూ విధానసభ ఆమోదించిన తీర్మానం కూడా అందిందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై షిండే
english title:
e
Date:
Wednesday, December 12, 2012