విజయనగరం (కలెక్టరేట్), జనవరి 30: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్
పరీక్షలు వచ్చేనెల 3 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో కళాశాలల
ప్రిన్సిపాల్స్ అప్రమత్తంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు పక్కాగా
చేయాలని ఇంటర్‌బోర్డు రీజనల్ ఇన్‌స్పెక్టర్ గోవిందరావు అన్నారు.
సోమవారం స్థానిక మోసానిక్ టెంపుల్‌లో కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో
నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రాక్టికల్ పరీక్షలు
నిర్వహణలో ఎటు(మిగతా 2వ పేజీలో)
వంటి గందరగోళం వద్దని, విద్యార్థులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని
అన్నారు. అలాగే ఈనెల 31న (మంగళవారం) ఇంటర్ స్థాయిలో
పర్యావరణంపై పరీక్షను అన్ని ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలలో
నిర్వహించాలని ఆదేశించారు. ఈ పరీక్షలకు విద్యార్థుల హాజరు తప్పని
సరి అంటూ పరీక్షకు హాజరు కాని విద్యార్థులు ఇంటర్ పరీక్షలు
రాసేందుకు అనర్హులన్నారు. ఈ సమావేశంలో ఇంటర్ బోర్డుపరీక్షల
కమిటీ సభ్యులు అప్పారావు, బాబ్జీ, కృష్ణ, పలు కళాశాలల ప్రిన్సిపల్స్,
సైన్స్ అద్యాపకులుపాల్గొన్నారు.