మాస్టర్స్ అభిషేక్, రాకేష్ సమర్పణలో అర్పణ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌లో ప్రసాద్‌బాబు లంక నిర్మాతగా పి.లక్ష్మీనారాయణరెడ్డి సహ నిర్మాతగా, పి.రాజ్‌కమల్ దర్శకత్వంలో ‘సువార్తికుడు’ లాంఛనంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ప్రసన్నకుమార్ తొలి క్లాప్‌నివ్వగా వరంగల్ అడిషనల్ ఎస్‌పి నటరాజ్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు వెల్డింగ్ శ్రీను మాట్లాడుతూ, ఓ ‘యదార్థ సంఘటనతో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పార్ట్‌నర్ ఒరిస్సాలో తన కళ్లముందే తన పిల్లల్ని దుండగులు కాల్చి చంపినసంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
అటువంటి యథార్థ సంఘటనలతో హృదయాన్ని హత్తుకునేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. నిర్మాత ప్రసాద్‌బాబు మాట్లాడుతూ, ‘చక్కటి కథతో రూపొందుతున్న చిత్రమిది. మా దర్శకుడు శ్రీను నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ చిత్రాన్ని తయారుచేసుకొన్నాడు. కథ వింటున్నప్పుడే కళ్ళవెంటే నీళ్ళు వచ్చాయి’ అన్నారు.
చిత్ర దర్శకుడు రాజ్‌కమల్ మాట్లాడుతూ- ఈ చిత్రాన్నిచేసే అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కవిత, రాంబాబు, శింగులూరి మోహన్, నందు, జయప్రకాష్, ప్రసన్న, నళిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:ఆనెమ్ వెంకట్, సహ నిర్మాత:పి.లక్ష్మీనారాయణరెడ్డి, నిర్మాత: ప్రసాద్‌బాబు లంక, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పి.రాజ్‌కమల్.
మాస్టర్స్ అభిషేక్, రాకేష్ సమర్పణలో అర్పణ ఆర్ట్ క్రియేషన్ బ్యానర్‌లో
english title:
s
Date:
Monday, December 17, 2012