చేవెళ్ల, డిసెంబర్ 20: చేవెళ్లలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్‌లు, రికార్డుల నిల్వలతో పాటు రసీదు పుస్తకాలపై రైతుల సంతకాలను వారు పరిశీలించారు. వీరభద్ర, ధనలక్ష్మి ఫెర్టిలైజర్ దుకాణాలను విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ డిఎస్పీ రమేశ్‌బాబు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. అయితే విజిలెన్స్ అధికారులు దుకాణాలకు వచ్చిన తర్వాతే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండు దుకాణాలలో ఎరువుల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో వాటి అమ్మకాలను నిలిపివేశారు. రికార్డులు సరిగాలేకపోతే సీజ్ చేయాలని ఆదేశించారు. దుకాణాలలో ఎరువుల నిల్వల వివరాలతో కూడిన నోటీసు బోర్డులు లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేవెళ్ల మండలంలో ఎరువుల స్టాక్ వివరాలను చేవెళ్ల మండల వ్యవసాయాధికారి సుధారాణి, విజయభారతిల నుంచి తీసుకుని వారు పరిశీలించారు. కాగా తనిఖీల విషయం తెలుసుకున్న మిగతా వ్యాపారులు అప్పటికప్పుడు దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
చేవెళ్లలోని ఎరువుల దుకాణాలను విజిలెన్స్
english title:
e
Date:
Friday, December 21, 2012